News February 1, 2026
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం: కిషన్ రెడ్డి

TG: కేంద్ర బడ్జెట్‌లో ఎరువులకు రాయితీ పెరిగిందని, దీనివల్ల రాష్ట్ర రైతులు లబ్ధి పొందుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ‘కాకతీయ టెక్స్‌టైల్స్ పార్క్‌కు మేలు చేసే పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. మెట్రో విస్తరణపై DPR ఇస్తే పట్టణాభివృద్ధి శాఖ నిధులు ఇస్తుంది. రాష్ట్రానికి 33 బాలికల హాస్టళ్లు, 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయి. డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహంతో TGకి లాభం ఉంటుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News February 20, 2026
రూ.10 కోట్లు ఇవ్వు.. రణ్‌వీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ రణ్‌వీర్ మేనేజర్ వాట్సాప్ నంబర్‌కు వాయిస్ నోట్ పంపాడని NDTV పేర్కొంది. దీనిపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమెరికాలోని ఆ నంబర్, మరింత సమాచారం కోసం అమెరికా పోలీసులతో సంప్రదింపులు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా హీరోకు భద్రతను పెంచనున్నారు.
News February 20, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News February 20, 2026
పురుగు మందులను కొంటున్నారా?

పంటల్లో చీడపీడల నివారణకు పురుగు మందులను కొనేటప్పుడు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోండి. ఒకే మందు పొడి మందుగాను, నీటిలో కరిగే ద్రావణంగాను, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. అవసరాన్ని బట్టి అంటే ఆశించిన పురుగు లేక తెగులును బట్టి, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను అనుసరించి నిపుణుల సూచనతో మందును కొనాలి. షాపు యజమాని నుంచి రసీదును తప్పక తీసుకోవాలి. కొనేమందు పురుగుల మందు డబ్బా గడువు తేదీని చూసి తీసుకోవాలి.


