News January 31, 2026
కేంద్ర బడ్జెట్: ఆ రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్!

ఈ ఏడాది WB, TN, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రేపు కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వే, హైవే, పట్టణ అభివృద్ది శాఖల ద్వారా ఈ రాష్ట్రాలకు నిధులు కేటాయించొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే WB, TN, కేరళలో పలు ప్రాజెక్టులకు PM మోదీ శంకుస్థాపనలు చేశారు. వీటికి నిధులతో పాటు కొత్త ప్రాజెక్టులూ ప్రకటించవచ్చని అంటున్నారు.
Similar News
News February 15, 2026
టెన్త్ పరీక్షలకు వైభవ్ సూర్యవంశీ దూరం

భారత U19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ టెన్త్ పరీక్షలకు హాజరవుతారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా ఆయన ఈ ఏడాది పరీక్షలకు హాజరు కావట్లేదని స్కూల్ డైరెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని వైభవ్ తండ్రి సంజీవ్ చెప్పారని పేర్కొన్నారు. వరుస టోర్నమెంట్లు, ట్రైనింగ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇటీవల జరిగిన U19 WCలో వైభవ్ 7 మ్యాచుల్లో 439 రన్స్ చేసి సత్తా చాటారు.
News February 15, 2026
$6.7B తగ్గిన విదేశీ మారక నిల్వలు

ఈ నెల 6తో ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు $6.711 బిలియన్లు తగ్గి $717.064Bకి చేరినట్లు RBI వెల్లడించింది. బంగారం నిల్వలు $14.208B తగ్గి $123.476B చేరడమే ఇందుకు కారణం. అంతకుముందు వారం ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ రిజర్వ్స్ రికార్డు స్థాయిలో $723.774Bకి పెరిగాయి. ఇప్పుడు కాస్త తగ్గినా మొత్తంగా బలంగానే ఉన్నాయని RBI పేర్కొంది. అటు విదేశీ కరెన్సీ ఆస్తులు $570.053Bకి పెరిగాయని తెలిపింది.
News February 15, 2026
వృద్ధాప్యంలో ఒంటరితనం వేధిస్తోందా?

వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం, ఏమైనా అయితే పిల్లలు రాగలరో లేరో అనీ కలవరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనంతో గతం గురించి ఆలోచిస్తూ కుంగుబాటుకూ లోనవుతారు. రోజూ కాసేపు ధ్యానం చేయడం, స్నేహితులు, బంధువులో సమయం గడపడం వంటివి మేలు చేస్తాయంటున్నారు. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుందని చెబుతున్నారు.


