News February 1, 2025
కేంద్ర బడ్జెట్.. మాజీ మంత్రి బుగ్గన స్పందన
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ‘బడ్జెట్లో ఏపీ కంటే బిహార్‌కే ఎక్కువ కేటాయింపులు జరిగాయి. ఈ బడ్జెట్ సంతృప్తిని ఇవ్వలేదు. బిహార్ కంటే ఏపీకే ఎక్కువ కేటాయింపులు జరగాలి. ఏపీ పునర్ విభజనలో కూడా అన్యాయం జరిగింది.’ అని పేర్కొన్నారు.
Similar News
News February 1, 2025
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ABV
AP: రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా విశ్రాంత IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావును(ABV)ను ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. వైసీపీ హయాంలో ABV రెండు సార్లు సస్పెండ్ కాగా, ఆ కాలాన్ని ప్రభుత్వం ఇటీవలే క్రమబద్ధీకరించింది. సస్పెన్షన్‌కు గురికాకపోతే వచ్చే అలవెన్సులు, వేతనం చెల్లించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
News February 1, 2025
ఇది దేశ గతినే మార్చే బడ్జెట్: బండి సంజయ్
TG: కేంద్ర బడ్జెట్ దేశ గతినే మార్చుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ ఇది. బడ్జెట్‌పై విపక్షాల అనవసర విమర్శలు మానుకోవాలి. కేంద్రానికి తెలంగాణ సర్కార్ సహకరించాలి’ అని అన్నారు. అలాగే, ఇది ప్రజారంజక బడ్జెట్ అని MP DK అరుణ కొనియాడారు. రూ.12లక్షల వరకు IT కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇది అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే బడ్జెట్ అని చెప్పారు.
News February 1, 2025
గొల్లపల్లి: రోడ్డు ప్రమాదం.. ఏడేళ్ల చిన్నారి దుర్మరణం
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన పురాణం స్పందన (7) అనే చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. స్పందన మండలంలోని చిల్వకోడూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నది. ప్యాసింజర్ ఆటో డోర్‌పై కూర్చొని ఇంటికి వస్తుండగా ఆటో ఎత్తేయడంతో పాప కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గొల్లపల్లి ఎస్ఐ సతీష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.