News November 11, 2025
కేంద్ర బృందం తుఫాన్ నష్టాన్ని తీర్చేనా…!

బాపట్ల జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా భారీగా నష్టం చేకూరిందని అధికారుల ప్రాథమిక అంచన వేసిన విషయం తెలిసిందే. జిల్లాలో 80,467 ఎకరాలలో పంటకు నష్టం వాటిల్లింది. రోడ్లు, కాలువలు దాదాపుగా అన్ని ప్రాంతాలు కోతకు గురయ్యాయి. చాలామంది గుడిసెలలో నివసించే నిరుపేద ప్రజలు వరద కారణంగా తమ నివాసాలను కోల్పోయామన్నారు. కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి తుఫాన్ నష్టాన్ని తీరుస్తుందా అని ప్రజలు అంటున్నారు.
Similar News
News November 11, 2025
గట్టు: ‘అమ్మ భవాని వసూళ్లు’ వదంతులపై ఎస్సై ఖండన

గట్టు మండల కేంద్రంలో శ్రీ అమ్మ భవాని జాతర పేరుతో ‘గలీజ్ దందా అంటూ గద్వాల సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వదంతులను గట్టు ఎస్సై కేటి మల్లేష్ ఖండించారు. ఎస్సై మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. రికార్డింగ్ డ్యాన్స్ పెట్టించే ఉద్దేశంతో కొందరు ఈ వసూళ్లకు పాల్పడినట్లు ప్రాథమికంగా తమ దృష్టికి వచ్చిందన్నారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News November 11, 2025
చండ్రుగొండ: స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల బాలుడి మృతి

చండ్రుగొండ మండలంలోని కరిసలబోడు తండాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. జూలూరుపాడు మండలానికి చెందిన సాయి ఎక్సలెంట్ స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు భూక్యా దర్శిత్ నాయక్ మృతి చెందాడు. భూక్యా గోపి-అఖిల దంపతుల కుమారుడైన దర్శిత్ బస్సు విద్యార్థుల కోసం తండాకు వచ్చినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై చండ్రుగొండ పోలీసులు కేసు నమోదు చేసి, బస్సు డ్రైవర్‌పై దర్యాప్తు చేపట్టారు.
News November 11, 2025
మేడ్చల్: నూతన ఇంటి గృహప్రవేశం.. చిందిన రక్తం

నూతన ఇంటి గృహప్రవేశం సందర్భంగా యజమానిని హిజ్రాలు డబ్బుల కోసం బెదిరించడమే కాకుండా, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కీసర మండలం చీర్యాలలోని బాలాజీ ఎంక్లేవ్‌లో సదానందం ఇంట్లో చోటుచేసుకుంది. వేడుకకు వచ్చిన ఇద్దరు హిజ్రాలు రూ.1లక్ష డిమాండ్ చేశారు. యజమాని నిరాకరించగా, 15 మంది హిజ్రాలు 3 ఆటోల్లో వచ్చి కుటుంబ సభ్యులను కర్రలతో కొట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


