News August 4, 2024
కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసిన IIIT డైరెక్టర్

నూజివీడులో ఉన్న విద్యార్థులను శ్రీకాకుళం IIIT క్యాంపస్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని IIIT డైరెక్టర్ ఆచార్య బాలాజీ, పరిపాలన అధికారి ముని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం క్యాంపస్‌లోని పలు సమస్యలను కేంద్ర మంత్రికి వివరించి వినతిపత్రం అందజేశారు.
Similar News
News February 20, 2026
శ్రీకాకుళం: కొత్త పంచాయతీలు ఎన్ని ఏర్పడతాయో?

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో 912 పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో చాలాచోట్ల కొత్త పంచాయతీలు ఏర్పాటు కోసం అధికారులకు ప్రతిపాదనలు పంపారు. కొత్తగా 64 పంచాయతీల ప్రతిపాదనలు అధికారులు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపారు. 35 కొత్త పంచాయతీలు ఏర్పాటుకు కమిషనర్ కార్యాలయం నుంచి ఆమోదం లభించింది. ఇంకా కొత్త పంచాయతీలు ఏర్పాటుపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.
News February 20, 2026
B.Ed సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. కాగా ఈ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. దీనితో కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరుగుతాయని తెలిపారు.
News February 20, 2026
శ్రీకాకుళం మీదుగా స్పెషల్ ట్రైన్స్

శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. రానున్న హోలీ పండుగ నేపథ్యంలో జిల్లా మీదుగా సాంత్రగచ్చి-యెలహంక-సాంత్రగచ్చి(నం.02863/64) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస స్టేషన్లలో ఆగనుందని రైల్వేశాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ రైలు మార్చి 5వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.


