News April 8, 2025

కేంద్ర మంత్రికి స్మార్ట్ సిటీ పనుల పురోగతిని వివరించిన కమిషనర్

image

కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ & అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పురోగతిపై ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. నగరంలో స్మార్ట్ సిటీ కింద చేపట్టి కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కమిషనర్ మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌కి వివరించారు.

Similar News

News April 8, 2025

నిజాంసాగర్: స్నానానికి వెళ్లి నీట మునిగి వ్యక్తి మృతి

image

మంజీరా నదిలో స్నానానికి వెళ్లి నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ వివరాలు.. నిజాంసాగర్ మండలం బంజేపల్లికి చెందిన భాగయ్య(48) మంజీరా నదిలో స్నానానికి వెళ్ళాడు. ప్రమాదవశత్తు నీట మునిగి మృతి చెందాడు. మృతదేహం నీటి ఒడ్డున లభ్యమైంది.. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

News April 8, 2025

కొత్తపల్లి: హత్య కేసులో నేరస్థుడికి జైలు శిక్ష

image

హత్యకేసులో నిందితుడికి యావజ్జీవజైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పుఇచ్చిందని ఎస్పీ యోగేశ్‌గౌతమ్ తెలిపారు. ఆయన వివరాలు.. వింజమూరుకు చెందిన జోగువెంకట్ రాములు కొత్తపల్లి మం. తిమ్మారెడ్డిపల్లికి చెందిన కృష్ణవేణిని అత్యాచారం విఫలయత్నంచేసి నిప్పంటించి హత్యచేశాడు. ఈకేసులో ముద్దాయికి సోమవారం జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ శిక్ష విధించారు. 2022 ఫిబ్రవరి 15న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామన్నారు.

News April 8, 2025

పంచాయతీ కార్యదర్శుల బదిలీల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి: ఆకుల రాజేందర్

image

హనుమకొండ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ పి.ప్రావిణ్యను కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌లో కలిసి పంచాయతీ కార్యదర్శుల బదిలీల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో బదిలీలు చేయడం సరికాదని కోరారు.

error: Content is protected !!