News February 1, 2025

కేంద్ర మంత్రితో బాపట్ల ఎంపీ భేటీ

image

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి H.D కుమారస్వామిని బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ నిమిత్తం రూ.11,440 కోట్లు కేటాయించినందుకు ఆయనకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు విషయాలను ప్రస్తావించారు.

Similar News

News March 2, 2026

గద్వాల: మైనారిటీ యువతులకు ఉచిత టైలరింగ్ శిక్షణ

image

తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని మైనారిటీ యువతులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి నుషిత సోమవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోపు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గల జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం (రూమ్ నెం. F-8) నందు సమర్పించాలని ఆమె సూచించారు.

News March 2, 2026

సీపీఎంలో తమ్మినేనిపై ‘ఎదురుగాలి’

image

సీపీఎంలో తిరుగులేని నేతగా వెలుగొందిన తమ్మినేని వీరభద్రం ప్రస్తుతం పార్టీలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈరోజు పొలిట్‌బ్యూరో సమావేశంలో ఆయన పనితీరుపై చర్చ జరిగినట్లు సమాచారం. తీరు మార్చుకోవాలని అధిష్ఠానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో గ్రూపు రాజకీయాల వల్ల దెబ్బతిన్న క్యాడర్‌ను బుజ్జగించేందుకు జాతీయనేతలు రంగంలోకి దిగారు. జిల్లా రాజకీయాల్లో తమ్మినేని పట్టు సడలడం చర్చనీయాంశంగా మారింది.

News March 2, 2026

రైల్వే ప్రయాణికులకు అలర్ట్: పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు

image

రాయనపాడు యార్డ్ పనుల వల్ల మే 1 నుండి 5 వరకు పలు రైళ్లు రద్దయ్యాయి. రైలు నంబర్లు 12861/62 (విశాఖ-మహబూబ్‌నగర్), 20809/10 (సంబల్‌పూర్-నాందేడ్), 20811/12 (విశాఖ-నాందేడ్) పూర్తిగా రద్దు చేయబడ్డాయి. అలాగే 18519/20 ఎక్స్‌ప్రెస్ గుంటూరు మీదుగా, 12803 స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ మీదుగా దారి మళ్లించబడతాయని వాల్తేరు డివిజన్ అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులు గమనించగలరు