News December 19, 2025
కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ కడియం కావ్య

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో అమలవుతున్న RUSA 2.0 (రీసెర్చ్&ఇన్నోవేషన్) ప్రాజెక్టుల గడువు పెంచాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కలిసి వినతిపత్రం అందజేశారు. గడువు పెంచకపోతే వరంగల్ యువత, పరిశోధకులు నష్టపోయే పరిస్థితి వస్తుందని, వరంగల్‌ను పరిశోధనలకు, నూతన ఆవిష్కరణల హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని అన్నారు.
Similar News
News December 19, 2025
ములుగు: ప్రకృతి విపత్తుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

ప్రమాదాలు ప్రకృతి విపత్తుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, సీఎస్ రామకృష్ణారావు సంయుక్తంగా నిర్వహించిన ఈ వీసీలో ములుగు కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. అకస్మాతుగా వచ్చే వరదలు, పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించినప్పుడు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు. మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్నారు.
News December 19, 2025
ANU: బీ ఫార్మసీ రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబరు నెలలో జరిగిన బీ ఫార్మసీ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. విడుదల చేసిన I, IV సంవత్సరాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో 70.98% ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యుయేషన్ కోసం ఈనెల 30వ తేదీ లోపు రూ.2,070 నగదు చెల్లించాలన్నారు. వివరాలకు వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ ను సంప్రదించాలన్నారు.
News December 19, 2025
‘3 ఇడియట్స్’ సీక్వెల్ టైటిల్ ఏంటంటే?

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించనున్న ‘3 ఇడియట్స్’ సీక్వెల్‌కు టైటిల్ ‘4 ఇడియట్స్’ అనుకుంటున్నారని తెలుస్తోంది. తొలి పార్టులో నటించిన ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషితో పాటు మరో సూపర్ స్టార్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా తెలిపింది. ఈ మూవీ 3 ఇడియట్స్ కంటే భారీగా ఉండనుందని వెల్లడించింది. నాలుగో క్యారెక్టర్‌కు న్యాయం చేసేలా కొన్ని కొత్త అంశాలు ఉంటాయని పేర్కొంది.


