News February 4, 2025
కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి సీతక్క

ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్లకు అదనపు నిధులు మంజూరు చేయాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
Similar News
News February 17, 2026
WNP: ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఐడీఓసీలోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో చేరుకునేలా సూచనలు చేయాలని పరీక్షల విధులు నిర్వహించే ప్రతి అధికారి బాధ్యతగా పని చేయాలన్నారు.
News February 17, 2026
వేరుశనగలో మొవ్వు కుళ్లు వైరస్ – నివారణ

మొవ్వు కుళ్లు వైరస్ సోకిన వేరుశనగ మొక్కల ఆకులపై తొలుత పచ్చని పాలిపోయిన వలయాలు ఏర్పడతాయి. పత్రహరితం పలచగా మారి మచ్చలు కనిపిస్తాయి. మొక్క మొవ్వు నల్లగా మారి ఎండిపోతుంది. మొక్కలు గిడసబారి, గుబురుగా ఉండి చిన్నచిన్న ఆకులు మెలితిరిగి ఉంటాయి. తెగులు సోకిన మొక్కల నుంచి వచ్చిన కాయ, విత్తనాలు చిన్నవిగా ఉంటాయి. తెగులు నివారణకు పంట 30 రోజులప్పుడు లీటరు నీటికి ఎసిటామిప్రిడ్ 0.2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News February 17, 2026
కామారెడ్డి: రంజాన్ సదుపాయాలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జయరాజ్ చెప్పారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో మైనార్టీలకు ఏమైనా సదుపాయాలు అవసరం ఉంటే కంట్రోల్ రూమ్ 8555805866 నంబర్‌కు, ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు.


