News April 3, 2025

కేంద్ర మంత్రిని కలిసిన వరంగల్ ఎంపీ

image

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని గురువారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు రహదారుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. పలు ప్రాజెక్టులపై చర్చించి అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.

Similar News

News April 4, 2025

ASF: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 4, 2025

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం హబ్షీపూర్‌లో జరిగింది. ఎస్ఐ గంగరాజు వివరాల ప్రకారం.. హబ్షీపూర్‌‌కి చెందిన కొక్కడగల్ల భాగ్యమ్మ (45) కూర్చున్న చోటే మృతి చెందిందని ఆమె కుమారులు ఫిర్యాదు చేశారు. కుమారులు సురేశ్, సమేల్ ఫిర్యాదు మేరకు కేసు నమెాదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News April 4, 2025

వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: కాంగ్రెస్

image

వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు. ‘త్వరలో బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం. రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్న మోదీ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తాం. CAAతో పాటు పలు చట్ట విరుద్ధ చర్యలపై వేసిన కేసులు కోర్టులో కొనసాగుతున్నాయి. వక్ఫ్ బిల్లుపైనా పోరాడతాం’ అని ఆయన పేర్కొన్నారు.

error: Content is protected !!