News April 3, 2025
కేంద్ర మంత్రిని కలిసిన ADB ఎంపీ, ఎమ్మెల్యేలు

ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయానికి భారత వైమానిక దళం ఆమోదం తెలపడం పట్ల ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మహేశ్వర్‌రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, రామారావు పటేల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని కలిసి సత్కరించారు. వీలైనంత త్వరగా ADB విమానాశ్రయం అభివృద్ధి చేసి పౌర విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
Similar News
News January 7, 2026
ఖమ్మం: మిర్చి ధర ఢమాల్.. రీజన్ ఇదే..!

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి పోటెత్తుతోంది. నిత్యం సుమారు 30 వేల బస్తాల వరకు వస్తోంది. మంగళవారం మార్కెట్‌లో క్వింటా మిర్చి గరిష్ఠ ధర రూ.14,800గా నమోదైంది. ఎకరాకు రూ.1.50లక్షల వరకు పెట్టుబడి పెట్టినా గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైనా వంటి దేశాల నుంచి ఎగుమతులు మందగించడమే ఈ ధరల పతనానికి కారణంగా తెలుస్తోంది. కనీసం రూ.20 వేల ధర లభిస్తేనే లాభదాయకమని రైతులు అంటున్నారు.
News January 7, 2026
పార్వతీపురం: ఈనెల 9న జిల్లా స్థాయి డాన్స్ పోటీలు

జిల్లా స్థాయి డాన్స్ పోటీలను ఈ నెల 9న నిర్వహిస్తామని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 15 సంవత్సరాలు లోపు ఒక కేటగిరీ, 15 సంవత్సరాలు దాటిన వారికి రెండో కేటగిరీగా విభజించి, గిరిజన, జానపద, దేశభక్తి నృత్యాలు కేటగిరిలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు.
News January 7, 2026
HYD: లవ్ ఫెయిల్.. యువ డాక్టర్ బలి!

సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ లావణ్య(23) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అదే కళాశాలలో జనరల్ మెడిసిన్ చదువుతున్న HYD అల్వాల్‌కు చెందిన ప్రణయ్‌కి 2025 జులైలో లావణ్యతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటానని నమ్మించి కులాన్ని అడ్డుగా చూపించి నిరాకరించాడు. దీంతో గడ్డి మందు ఇంజెక్ట్ చేసుకుని లావణ్య సూసైడ్ చేసుకుంది. ప్రణయ్‌పై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.


