News January 19, 2025

కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన షెడ్యూల్ 

image

కేంద్ర మంత్రి అమిత్‌షా గన్నవరం పర్యటన షెడ్యూల్ వివరాలను సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆదివారం ఉదయం 10.45 గంటలకు విజయవాడలోని నోవాటెల్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించే అమిత్‌షా కొండపావులులోని NIDM ప్రాంగణానికి చేరుకుంటారన్నారు. 11.15కి అక్కడ భవనాలను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం 11.35 గంటలకు NDRF పదో బెటాలియన్ క్యాంపస్‌ను ప్రారంభించి సభలో ప్రసంగిస్తారన్నారు. 

Similar News

News January 19, 2025

నేడు అమిత్ షా ప్రారంభించనున్న NIDM పూర్తి వివరాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(NIDM) దక్షిణ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకురాగా 2015లో గన్నవరం మండలం కొండపావులూరులో రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. 2018 మేలో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఏపీ విభజన చట్టం-2014 ప్రకారం ఏర్పాటైన ఈ కేంద్ర సంస్థ తాజాగా నిర్మాణం పూర్తి చేసుకోగా నేడు మంత్రి అమిత్‌షా లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

News January 19, 2025

పెనమలూరు: బాలికపై లైంగిక దాడికి యత్నించిన ప్రబుద్ధుడు

image

తాడిగడప కంటి ఆసుపత్రి సమీపంలో నివసిస్తున్న నారాయణ(60) తన ఇంటి సమీపంలో నివసిస్తున్న రెండో తరగతి చదివే బాలికపై లైంగిక దాడికి యత్నించడంతో పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి బాలిక తమ కుక్క పిల్ల కోసం నారాయణ ఇంటి సమీపంలోకి వెళ్లింది. అతడు లైంగిక దాడి చేయబోగా బాలిక తప్పించుకొని వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన శనివారం అతడిని అరెస్ట్ చేశారు.

News January 19, 2025

జగ్గయ్యపేట: తల్లితో సహజీనం చేస్తున్న వ్యక్తిని చంపాడు

image

ఈనెల 16న జగ్గయ్యపేటకు చెందిన ఎర్రంశెట్టి ఆంజనేయులు హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్యకు గల కారణాలను పోలీసులు వివరించారు. బెల్లంకొండ నరేశ్ అనే వ్యక్తి హత్య చేసినట్లు నిర్ధారించారు. నరేశ్ తల్లి ఆంజనేయులుతో సహజీవనం చేస్తున్నందున తట్టుకోలేని నరేశ్ హత్యచేశాడు. హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.