News June 17, 2024

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే

image

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సోమవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ.. నిబద్దతతో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన నాయకులను పార్టీ గుర్తిస్తుందన్నారు. దానికి కిషన్ రెడ్డి నిదర్శనమని కొనియాడారు.

Similar News

News February 21, 2026

శాంతియుతంగా పండుగలు జరుపుకుందాం: సీపీ

image

రాబోయే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రజలందరూ సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య పిలుపునిచ్చారు. శనివారం కమిషనరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీక అని కొనియాడారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 21, 2026

ఆర్మూర్ మున్సిపాలిటీలో రూ.500 కోట్ల కుంభకోణం?

image

2014-25 మధ్య ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన రూ.500 కోట్ల అవినీతిపై విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైంది. ఇటీవల కమిషనర్ రాజు ఏసీబీకి చిక్కడంతో పాత అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ ఇంటి నంబర్ల కేటాయింపుపై అధికారులు ఆరా తీస్తున్నారు. 11 ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది, అవుట్‌సోర్సింగ్ నియామకాల్లో వసూళ్లపై త్వరలోనే డొంక కదలనుంది.

News February 21, 2026

NZB: విద్యాశాఖలో ప్రక్షాళన.. ప్రైవేట్ స్కూల్ సెక్షన్ల మార్పు

image

జిల్లా విద్యాశాఖలో ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బందిపై వేటు పడనుంది. ప్రైవేట్ పాఠశాలల విభాగాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారిని తక్షణమే మార్చాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. జిల్లాలో 9 మంది సిబ్బంది ప్రైవేట్ స్కూల్ పనులు చూస్తుండగా, ఐదుగురు మూడేళ్లుగా అక్కడే ఉండటంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 3 రోజుల్లో సెక్షన్ల మార్పునకు అధికారులు రంగం సిద్ధం చేశారు.