News October 27, 2025

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడి పేరు ఇదే..!

image

కేంద్ర పౌర విమానాయన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడికి నామకరణం మహోత్సవం ఢిల్లీలో ఆదివారం నిర్వహించారు. రామ్మోహన్ కుమారుడికి శివన్ ఎర్రం నాయుడు అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, జీఎంఆర్ సంస్థల అధినేత, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు, ఎర్రం నాయుడు సోదరులు, కింజరాపు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News February 4, 2026

శివనాగ గౌరిని అభినందించిన సీఎం చంద్రబాబు

image

గ్రూపు-1 ఫలితాలలో సత్తా చాటి డీఎస్పీగా ఎంపికైన ఎచ్చెర్ల (M) ఎస్.ఎం.పురం గ్రామానికి చెందిన సంపతిరావు శివనాగ గౌరిని సీఎం చంద్రబాబు అభినందించారు. మంత్రి అచ్చెన్నాయుడుతో కలసి ఆమె తన భర్త శ్రీకాకుళం డీసీఎంఎస్ ఛైర్మన్ చౌదరి అవినాష్‌లు ఇద్దరూ సీఎం‌ను బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భవిష్యత్‌లో శివనాగ గౌరి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

News February 4, 2026

SKLM: ‘గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకువస్తాం’

image

జిల్లాలోని గ్రంథాలయాలను విజ్ఞాన నిలయాలుగా తీర్చిదిద్ది, వాటికి పూర్వవైభవం తీసుకువస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పీరుకట్ల విఠల్ రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ 6.కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఆమోదించి పౌర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సభ్యులు పాల్గొన్నారు.

News February 4, 2026

మందస: రైలు కింద పడి ఆర్మీ హవల్దార్ సూసైడ్

image

రైలు కింద పడి ఆర్మీ హవల్దార్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మందస(M)హరిపురం రైల్వే లైన్ సమీపంలో బుధవారం జరిగింది. రాధాకృష్ణపురానికి చెందిన జోగారావు(36) ఆర్మీ హవల్దార్‌గా జమ్మూలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సెలవులకు ఇంటికి వచ్చారు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టానికి పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.