News July 22, 2024
కేంద్ర మంత్రులను కలిసిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి

పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరిని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కలిశారు. తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు.
Similar News
News September 8, 2025
భద్రాచలం: 23 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2న జరిగే విజయదశమి వేడుకలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 23 నుంచి రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అక్టోబర్ 7న శబరి స్మృతియాత్ర నిర్వహిస్తామని ఆలయ ఈవో దామోదర్ రావు, వైదిక కమిటీ సభ్యులు తెలిపారు.
News September 7, 2025
అసంపూర్తి గణనాథుల నిమజ్జనం.. భక్తుల ఆవేదన

ఖమ్మం మున్నేరు నది ఒడ్డున అసంపూర్తిగా నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాలు కనిపించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనం చేసే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లు ఉన్నప్పటికీ నిమజ్జనం సరిగా జరగలేదని విమర్శించారు. అధికారులు స్పందించి విగ్రహాలను పూర్తిస్థాయిలో నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News September 7, 2025
ఖమ్మం: రేపు రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

స్థానిక సంస్థల ఓటర్ల జాబితాకు సంబంధించి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రేపు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్ల జాబితాపై సమీక్షించనున్నారు. జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులు రేపు సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో హాజరుకావాలని కలెక్టర్ కోరారు.