News December 13, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

AP: కేంద్ర మాజీ మంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణమూర్తి అమలాపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. పెట్రోలియం&కెమికల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. INC జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.
Similar News
News December 17, 2025
టాటా కొత్త కారు.. ఫస్ట్ రోజే 70వేల బుకింగ్స్

టాటా మోటార్స్ నూతనంగా తీసుకొచ్చిన ‘<<18386296>>సియారా<<>>’ మోడల్ కారు రికార్డులు బ్రేక్ చేస్తోంది. బుకింగ్ ప్రారంభమైన తొలిరోజే (డిసెంబర్ 16) 70వేల బుకింగ్స్ అయ్యాయని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ SUV ధర రూ.11.49 లక్షల-రూ.21.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. రెడ్, ఎల్లో, సిల్వర్, గ్రీన్, మింటల్ గ్రే, వైట్ కలర్లలో అందుబాటులో ఉన్నాయి.
News December 17, 2025
ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు: CM

AP: గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని CM CBN కలెక్టర్లను ఆదేశించారు. ‘ఇటీవల 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాం. ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించబోతున్నాం. ప్రతి 3 నెలలకు టార్గెట్ పెట్టుకుని నిర్మాణం పూర్తి చేయాలి. గతంలో ఊళ్లకు దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో కొందరు వెళ్లడం లేదు. వారికి ఇతర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలి’ అని సూచించారు.
News December 17, 2025
ఐటీఐ అర్హతతో 156 పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<


