News March 12, 2025

కేజీబీవీని తనిఖీ చేసిన MHBD కలెక్టర్

image

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ ప్రభుత్వ బాలికల పాఠశాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెడుతున్న భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల పరిశాలను పరిశీలిస్తూ.. పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Similar News

News December 21, 2025

పాకిస్థాన్‌తో ఫైనల్.. టీమ్ ఇండియా ఓటమి

image

అండర్-19 ఆసియాకప్ ఫైనల్: పాకిస్థాన్‌తో మ్యాచులో టీమ్‌ఇండియా ఘోర పరాజయం పాలైంది. సీజన్ మొత్తం అదరగొట్టిన ఆయుశ్ సేన కీలక మ్యాచులో చేతులెత్తేసింది. 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 156 పరుగులకే ఆలౌటైంది. దీంతో 191 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. హిట్టర్ సూర్యవంశీ(26), జార్జ్(16), అభిజ్ఞాన్(13) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. చివర్లో దీపేశ్ దేవేంద్రన్ (16 బంతుల్లో 36) దూకుడుగా ఆడారు.

News December 21, 2025

SSS: అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!

image

హిందూపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ వరలక్ష్మి తెలిపారు. ఈ నెల 22 నుంచి 30 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పరిధిలో కార్యకర్త 1, 12 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఖాళీల భర్తీ పారదర్శకంగా చేపడతామన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News December 21, 2025

₹లక్ష కోట్లు దోచుకున్న జగన్‌కు పరకామణి చోరీ చిన్నదే కావొచ్చు: లోకేశ్

image

AP: తిరుమల పరకామణిలో చోరీపై Ex CM జగన్ స్పందన ఆయన దోపిడీ స్థాయిని వెల్లడిస్తోందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ‘జనం సొమ్ము ₹లక్ష కోట్లు దోచుకున్న జగన్‌కు పరకామణి చోరీ చిన్నదే కావొచ్చు. ఈ చోరీ పెద్ద పాపం. సాక్షులు, సాక్ష్యాధారాలు లేకుండా చేసి తప్పించుకోవడానికి ఇది బాబాయి కేసో, కోడి కత్తి కేసో కాదు. వెంకన్నకు చేసిన మహా అపచారం. ఆ దేవదేవుడి కోర్టు నుంచి తప్పించుకోవడం అసాధ్యం’ అని ట్వీట్ చేశారు.