News April 14, 2025
‘కేజీహెచ్‌లో అందుబాటులో అన్నిరకాల మందులు’

కేజీహెచ్‌లో రోగులకు అందుబాటులో అన్ని రకాల మందులు ఉన్నాయని సూపరింటెండెంట్ శివానంద్ ఆదివారం తెలిపారు. కెజీహెచ్‌లో రూ.1.5 కోట్ల విలువ గల అన్ని రకాల మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి రోగులకు అందుబాటులో తీసుకువచ్చామన్నారు. రోగులకు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్ మందులను వారం రోజులకు సరిపడనట్లు ఇస్తున్నామన్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు 90 రోజులకు సరిపడే విధంగా మందులు ఇస్తున్నామన్నారు.
Similar News
News April 15, 2025
మల్కాపురం: బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

మల్కాపురంలో ఓ యువకుడు తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వానపల్లి సాయి గణేశ్ (23) మల్కాపురం హరిజన వీధిలో ఉంటున్నాడు. తనకు బైక్ కొనివ్వాలని వారం రోజులుగా తల్లిదండ్రులతో గొడవపడేవాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. తండ్రి అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News April 15, 2025
విశాఖ: లారీ ఢీకొని మహిళ మృతి

విశాఖలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. టూటౌన్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్య బస్సు కోసం సహోద్యోగి ద్విచక్రవాహనంపై జైలురోడ్డు నుంచి జగదాంబ జంక్షన్‌కి వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటు నుంచి వస్తున్న జీవీఎంసీ గార్బేజ్ లారీ వారిని వెనుక నుంచి ఢీకొట్టింది. ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న లావణ్య కుడివైపు పడిపోవడంతో ఆమె తలపై నుంచి లారీ వెళ్లింది.
News April 15, 2025
పక్క పక్కనే షెడ్డులు ఉండటంతో ప్రాణనష్టం: అనకాపల్లి ఎస్పీ

కైలాసపట్నం బాణసంచా కేంద్రంలో క్రాకర్స్ తయారీకి కెమికల్స్‌ను గ్రైండర్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కోటవురట్ల పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. రెండో నంబర్ షెడ్లలో పేలుడు జరిగి వ్యాపించిన మంటలు దగ్గరలో ఉన్న ఒకటో నంబర్ షెడ్‌కు వ్యాప్తి చెందినట్లు తెలిపారు. పక్క పక్కనే షెడ్‌లు ఉండటంవల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.