News December 23, 2024
కేజీహెచ్‌లో ఓపీ కౌంటర్ వద్ద పనిచేయని సర్వర్లు..!
విశాఖ కేజీహెచ్‌లో సర్వర్లు పని చేయక రోగులు కష్టాలు పడుతున్నారు. తెల్లవారి నుంచి ఓపి కౌంటర్ దగ్గర గంటల తరబడి లైన్‌లో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. టోకెన్లకే సమయం అయిపోతుందని రోగులు ఆందోళన చెందుతున్నారు. ఓపి కౌంటర్ వద్ద ప్రతిరోజు రోగులకు కష్టాలు తప్పడం లేదని.. ప్రత్యమ్నాయం చేపట్టాలని రోగుల బంధువులు కోరుతున్నారు.
Similar News
News December 23, 2024
విశాఖ: ‘అభివృద్ధి పథకాలపై జిల్లాల వారీగా సమీక్ష’
ఉపాధి హామీ పథకం, అమృత్ పథకం, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన తదితర అభివృద్ధి పథకాలపై జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ 20 సూత్రాల ఛైర్మన్ ఎల్.దినకర్ తెలిపారు. సోమవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సమీక్ష సమావేశాల అనంతరం నివేదికలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీందర్ పాల్గొన్నారు.
News December 23, 2024
భీమిలి తీరానికి కొట్టుకొచ్చిన తాబేళ్ల కళేబరాలు
భీమిలి మండలం తిమ్మాపురం సముద్ర తీర ప్రాంతానికి రెండు తాబేళ్ల కళేబరాలు ఆదివారం కొట్టుకొచ్చాయి. రెండు రోజులుగా భీమిలి, ఉప్పాడ, మంగమూరిపేట తదితర తీర ప్రాంతాలకు తాబేళ్ల కళేబరాలు కొట్టుకొస్తున్నట్లు స్థానిక మత్స్యకారులు తెలిపారు. ఈ సీజన్‌లో గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తుంటాయని వారు వెల్లడించారు. కాలుష్యం కారణంగా ఇవి మృత్యువాత పడుతున్నట్లు భావిస్తున్నారు.
News December 23, 2024
విశాఖ: స్పా సెంటర్లో వ్యభిచారం
విశాఖ వీఐపీ రోడ్డులో Devinci థాయ్ స్పా సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారం మేరకు త్రీటౌన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ తిరుమలరావు ఆదివారం సోదాలు చేశారు. ఈ సోదాల్లో మహిళలకు అధిక సొమ్ము ఆశ చూపి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. వ్యభిచార నిర్వాహకుడితో పాటు నలుగురు విటులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నలుగురు బాధిత మహిళలను శక్తి సదన్ హోమ్‌కు పంపారు.