News January 25, 2026

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ ధర ₹290-300, కామారెడ్డిలో ₹280, వరంగల్‌లో ₹290గా ఉంది. విశాఖలో ₹280, తిరుపతిలో ₹240-270, నంద్యాలలో ₹240-280 చిత్తూరు, బాపట్ల, గుంటూరులో ₹280-300, విజయవాడలో ₹310-330 వరకు పలుకుతోంది. ఇక కిలో మటన్ ధర ₹800-1000 వరకు ఉంది. మీ ప్రాంతంలో రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

Similar News

News February 6, 2026

వివాహితకు ‘పెళ్లి హామీ‘ చెల్లదు.. కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు

image

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ మహిళా న్యాయవాది పెట్టిన రేప్ కేసును SC కొట్టివేసింది. ఇప్పటికే వివాహ బంధంలో ఉన్న మహిళకు ‘పెళ్లి హామీ‘ చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. ఇది పరస్పర అంగీకారంతో కొనసాగిన సంబంధం చెడిపోయిన తరువాత దాఖలైన కేసుగా జస్టిస్ BV నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. హిందూ వివాహ చట్టం ప్రకారం భర్త ఉన్నప్పుడు మరో వివాహానికి అర్హత లేదని గుర్తుచేసింది.

News February 6, 2026

216 మంది BLA రెబల్స్‌ను హతమార్చాం: పాక్ ఆర్మీ

image

కొన్ని రోజులుగా బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జరుగుతున్న ఘర్షణల్లో 216 మంది BLA రెబల్స్‌ను హతమార్చినట్లు పాక్ ఆర్మీ వెల్లడించింది. కీలక నేతలు, కమాండ్ కంట్రోల్ స్థావరాలను నేలకూల్చామని తెలిపింది. మరోవైపు ఈ ఆపరేషన్‌లో 36 మంది పౌరులు, 22 మంది సైనికులు కూడా చనిపోయినట్లు పేర్కొంది. కోల్, గోల్డ్, కాపర్, గ్యాస్ నిక్షేపాలు ఉన్న బలూచిస్థాన్ స్వాతంత్య్రం కోసం కొన్నేళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి.

News February 6, 2026

నేడే U19 WC ఫైనల్.. ఫేవరెట్‌గా భారత్!

image

U19 ODI WC ఫైనల్‌లో ఇవాళ IND, ENG తలపడనున్నాయి. హరారే వేదికగా మ.ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకూ IND ఒక్క మ్యాచూ ఓడలేదు. టోర్నీ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఉంది. ఇప్పటివరకు 5సార్లు (2000, 08, 12, 18, 22) కప్ గెలిచింది. అటు ENG ఒక్కసారి మాత్రమే(1998) ఛాంపియన్ అయింది. U-19 WCలలో IND, ENG 9 మ్యాచులు ఆడగా ఏడింట్లో INDనే గెలవడం గమనార్హం.
LIVE: Starsports, Jio Hotstar