News February 13, 2025

కేటిదొడ్డి: కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో తనిఖీలు

image

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటక – తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. కేటిదొడ్డి మండలం నందిన్నె చెక్ పోస్టు వద్ద వెటర్నరీ అధికారి‌ డాక్టర్ నవీన్ చంద్ర, ఎక్సైజ్ కానిస్టేబుల్ జగదీష్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి సరఫరా అయ్యే కోళ్లకు సంబంధించి వాహనాలను తనిఖీ చేశారు.

Similar News

News February 13, 2025

HYD: ఫ్రీ కరెంట్.. పైగా ఖాతాలోకి నగదు

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ విద్యుత్‌శాఖ ఏఈ మురళీకృష్ణ సూచించారు. ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుంటే ఉపయోగాలు సూచించారు. ప్యానెల్స్‌ను అనుసంధానించి ఇంట్లో ఏర్పాటు చేసిన మీటర్ ద్వారా వినియోగించగా మిగిలిన విద్యుత్ డిస్కంలకు సరఫరా అవుతుంది. డిస్కంలతో ఒప్పందం ప్రకారం 6 నెలలకు ఒకసారి లెక్కేసి ఖాతాలో నగదు జమ చేస్తారు. #SHARE IT

News February 13, 2025

భద్రాద్రి: కోర్టు వాయిదాలకు రాకపోవడంతో వ్యక్తికి రిమాండ్

image

కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తికి మెజిస్ట్రేట్ కంభపు సూరి రెడ్డి రిమాండ్ విధించారు. మెజిస్ట్రేట్ వివరాలిలా.. 2023లో అశ్వాపురానికి చెందిన ముత్యంబోయిన వెంకటేశ్వర్లు అదే మండలానికి చెందిన సున్నం సత్యనారాయణకు రూ.8 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అవి చెల్లించేందుకు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. బాధితుడు కోర్టులో కేసు దాఖలు చేయగా, వాయిదాలకు రాకపోవడంతో రిమాండ్ విధించారు.

News February 13, 2025

26న పోలింగ్ సామాగ్రి పంపిణీ: కలెక్టర్

image

కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. కలెక్టరేట్ లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ప్రిసైడింగ్ అధికారులు, కమిషనర్లు, ఎంపీడీవోలు, తాహశీల్దార్లు, సెక్టార్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. 26న ఏసీ కళాశాలలో పోలింగ్ కేంద్రాల సామాగ్రిని అందిస్తామని చెప్పారు.

error: Content is protected !!