News March 13, 2025
కేటిదొడ్డి: ‘చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి’

నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఎడమ కాలువ 104వ ప్యాకేజీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గురువారం కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నె, కొండాపురం, మైలగడ్డ గ్రామాల వద్ద సాగునీటి ఆవశ్యకత గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాగునీటి కాలువలను పరిశీలించారు. రైతుల అభ్యర్థన మేరకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
Similar News
News December 16, 2025
ధర్మారం: డబ్బు, మద్యం పంచకుండా సర్పంచ్ అయిన వృద్ధుడు

ధర్మారం మండలం పైడిచింతలపల్లిలో ఈనెల 14న జరిగిన ఎన్నికల్లో 70 సంవత్సరాల వృద్ధుడు సున్నం రాజయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజయ్య గతంలో పలుమార్లు సర్పంచ్‌గా నామినేషన్ వేసి పలువురి ఒత్తిళ్లతో ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఎందరు బుజ్జగించినా వినకుండా బరిలో నిలిచారు. ఎలాంటి డబ్బు, మద్యం పంచకుండా 281 ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్థిపై 26 ఓట్ల తేడాతో సర్పంచ్‌గా విజయం సాధించారు.
News December 16, 2025
జంగారెడ్డిగూడెం: లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు

జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామానికి చెందిన 10 సంవత్సరాల బాలికపై ఆమె మారుతండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. ముద్దాయిపై రౌడీ షీట్ కూడా తెరుస్తున్నామని పోలీసులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎవరైనా ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడితే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
News December 16, 2025
క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం: ఏపీఐఐసీ డైరెక్టర్

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని APIIC డైరెక్టర్ దోమా జగదీశ్ గుప్తా అన్నారు. మంగళవారం కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో కర్నూలు జిల్లా నెట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా నెట్ బాల్ సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలను జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర బాబుతో కలిసి ప్రారంభించారు. నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా తీర్చేందుకు మంత్రి కృషి చేస్తున్నారన్నారు.


