News January 12, 2026
కేటిదొడ్డి మండలంలో యువతి అదృశ్యం

గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఉమిత్యాల తండాకు చెందిన ఈరమ్మ (19) అనే యువతి అదృశ్యమైనట్లు ఎస్సై పి.శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 8న ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం తల్లి చంద్రమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 16, 2026
విజయవాడలో నేడు బిల్ గేట్స్ పర్యటన.. వివరాలివే!

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్ సోమవారం విజయవాడలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కీలక రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించేందుకు ఆయన తన బృందంతో కలిసి వస్తున్నారు. ఉదయం 8:10 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన సచివాలయం చేరుకుంటారన్నారు. అలాగే మధ్యాహ్నం 12:40కు పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య స్టేడియంకు విచ్చేయనున్నారు.
News February 16, 2026
రూ.10 కోట్లు పెట్టినా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు: మృణాల్

యాక్టర్‌గా ఉండటమంటే సన్యాసిగా జీవించడం లాంటిదేనని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. తిండి, నిద్ర వదులుకోవాలని, ఫోకస్డ్‌గా ఉండాలని చెప్పారు. ‘నాకు PR టీమ్ లేదు. <<19123301>>నాపై వచ్చిన<<>> రూమర్స్ ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. ₹10 కోట్లు పెట్టినా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. రూమర్స్‌ను పట్టించుకుంటే కెరీర్‌పై ఫోకస్ చేయలేను’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె నటించిన ‘దీ దీవానే సెహర్ మే’ ఈ నెల 20న రిలీజ్ కానుంది.
News February 16, 2026
పాక్‌పై విజయం.. అప్పుడూ శివరాత్రి రోజే..!

T20 WCలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా <<19153355>>ఘన విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల కిందట కూడా శివరాత్రి రోజే పాక్‌తో ODI WC మ్యాచ్ జరిగింది. 2003 మార్చి 1న తొలుత పాక్ 273 పరుగులు చేయగా, సచిన్ చెలరేగడంతో 45.4 ఓవర్లలోనే ఇండియా గెలిచింది. సచిన్ 98 పరుగులతో త్రుటిలో సెంచరీ కోల్పోయారు. మరోవైపు 2015 ODI WCలో FEB 15నే పాక్‌ను మన జట్టు ఓడించింది.


