News April 15, 2024

కేటీఆర్‌ను కలిసిన వరంగల్ ఎంపీ అభ్యర్థి

image

వరంగల్ పార్లమెంట్ ప్రస్తుత & మాజీ శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులతో పాటు వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, డా.సుధీర్ కుమార్ సోమవారం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ నేతలు పార్లమెంట్ స్థానం కైవసం చేసుకుంటామని, అందుకు అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వినయ్ భాస్కర్, తదితరులున్నారు.

Similar News

News October 2, 2024

WGL: నేడు ఎంగిలిపూల బతుకమ్మ

image

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ప్రకృతితో మమేకమయ్యే సంబరం బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజులపాటు తొమ్మిది రకాల ప్రసాదాలను బతుకమ్మకు నివేదిస్తారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ అలంకరణ చేస్తారు. దీనికోసం రకరకాల పువ్వులు తీసుకొచ్చే బతుకమ్మగా పేరుస్తారు. ఈరోజు నువ్వులు, నూకలు లేదా బియ్యం, బెల్లంతో నైవేద్యం చేసి బతుకమ్మకు సమర్పిస్తారు.

News October 2, 2024

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ చిహ్నం: మంత్రి

image

సుసంపన్నమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ చిహ్నమని మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు మహాలయ అమావాస్య (పెత్ర అమావాస్య)ను పురస్కరించుకుని మంత్రి సురేఖ మహిళా లోకానికి, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ తొమ్మిది రోజుల పండుగతో తెలంగాణ పల్లెలు కొత్త కాంతులతో విరాజిల్లుతోందని మంత్రి అన్నారు.

News October 2, 2024

డోర్నకల్: ‘తండ్రి మరణాన్ని దిగమింగుకుని ఉద్యోగం సాధించాడు’

image

డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన వెగ్గళం విజయ్ డీఎస్సీలో జిల్లా స్థాయిలో 46వ ర్యాంక్ సాధించి ప్రతిభ కనపరిచాడు. అతని తండ్రి ప్రభాకర శాస్త్రి ఎగ్జామ్‌కి 3 రోజులకి ముందు మరణించాడు. ఆ మరణాన్ని దిగమింగుకుని పరీక్ష రాశాడు. SGT ఉద్యోగాన్ని సాధించడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డానని, తన 10 సంవత్సరాల నిరీక్షణ ఫలించిందని, తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం ఈ ఉపాధ్యాయ ఉద్యోగం అని విజయ్ అన్నారు.