News September 17, 2024

కేటీఆర్‌ను కలిసిన KMR మాజీ ZP ఛైర్మన్ దఫెదర్ రాజు

image

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన జాతీయ సమైఖ్యత దినోత్సవ కార్యక్రమంలో కేటిఆర్‌ను KMR మాజీ ZP ఛైర్మన్ దఫెదర్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. కేటిఆర్‌తో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ZP ఛైర్మన్ దఫెదర్ రాజు, NZB మాజీ జిల్లా ఛైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబుద్దిన్ ఉన్నారు.

Similar News

News December 14, 2025

నిజామాబాద్: సర్పంచ్‌గా తొలి విజయం మహిళదే

image

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఫలితాలు వెలువడుతున్నాయి. మోపాల్ మండలం శ్రీరాంనగర్‌తండా సర్పంచ్‌గా గుగులోత్ సరోజ 84 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి బస్సీ సునీతపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందటంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. ఉపసర్పంచ్ ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు.

News December 14, 2025

నిజామాబాద్‌లో రెండో విడత పోలింగ్ ప్రశాంతం

image

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ
ప్రశాంతంగా ముగిసింది. డిచ్‌పల్లి మండలంలో స్వల్ప ఘర్షణ జరిగినప్పటికీ పోలీసులు దాన్ని సమర్థవంతంగా నివారించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల పరిశీలకుడు శాంప్రసాద్ లాల్ ఎనిమిది మండలాల్లో తిరుగుతూ పోలింగ్ సరళిని పరిశీలించారు.

News December 14, 2025

నిజామాబాద్: 1PM UPDATE 72.56 శాతం

image

రెండో దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1,081WMలకు 72.56 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది….
* ధర్పల్లి మండలంలో 68.30%,
* డిచ్‌పల్లి-62.68%
* ఇందల్వాయి-75.29%
* జక్రాన్‌పల్లి-72.80%
* మాక్లూర్-76.66%
* మోపాల్- 78.95%
* NZB రూరల్-80.47%
* సిరికొండ-73.13% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.