News July 28, 2024
కేటీఆర్ పర్యటనపై చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ విమర్శలు

కేటీఆర్ ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ సందర్శించడంపై చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు క్షమించమని కాళేశ్వరంలో పూజలు చేసేందుకు వచ్చినట్లు ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు.
Similar News
News August 6, 2025
ఆదిలాబాద్: కృష్ణ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు సూచన

విజయవాడ డివిజన్లో లైబీ బ్లాక్ కారణంగా ADB నుంచి తిరుపతి వరకు నడిచే కృష్ణ ఎక్స్ ప్రెస్‌ను కొద్దీ రోజులు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 17406 ADB నుంచి తిరుపతి నడిచే రైలు ఈనెల 8,10,12 తేదీలలో రెండు గంటలు ఆలస్యంగా ఉంటుందన్నారు. రైలు నంబర్ 17405 తిరుపతి నుంచి ADB నడిచే రైలు ఈనెల 13 నుంచి 19 వరకు రద్దు, 17406 ADB నుంచి తిరుపతి ఈనెల 14 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నామన్నారు.
News August 6, 2025
ఆదిలాబాద్: ‘ఆకతాయిల వేధిస్తే షీ టీంను సంప్రదించండి’

ఆకతాయిల వేధింపులకు గురైతే వెంటనే షీ టీం నంబర్ 8712659953కు సంప్రదించాలని షీ టీం ఇన్‌ఛార్జ్ ఏఎస్ఐ సుశీల సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. బుధవారం ఆదిలాబాద్‌లోని సరస్వతి శిశు మందిర్‌లో విద్యార్థులకు షీ టీం సేవలపై ఆమె అవగాహన కల్పించారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, హెల్ప్‌లైన్ నంబర్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది వాణిశ్రీ, మహేష్, మోహన్ పాల్గొన్నారు.
News August 6, 2025
తాంసి: ఒకరికి షోకాజ్ నోటీసులు

తాంసి PHCని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఒకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రిజిష్టర్ పరిశీలించి గైర్హాజరైన వారి వివరాలు డాక్టర్‌ను ఫోన్‌లో ద్వారా తెలుసుకున్నారు. తను అర్బన్ హెల్త్ సెంటర్ హమాలివాడలో ఆరోగ్య మహిళా కార్యక్రమంలో పాల్గొన్నట్లు వైద్యులు శ్రావ్య వాణీ తెలిపారు. తాంసీ పీహెచ్‌సీలో విధులకు గైర్హాజరైన జూనియర్ అసిస్టెంట్ తేజకు షోకాస్ నోటీస్ జారీ చేశారు.