News January 23, 2026

కేటీఆర్ విచారణ @6 గంటలు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ సుమారు 6 గంటలుగా కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పీఎస్‌లో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో ఏం జరగనుందో అని పీఎస్ బయట BRS శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. పోలీసులకు వ్యతిరేకంగా మహిళా కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Similar News

News February 21, 2026

గొర్రెల పెంపకం – పాక్షిక సాంద్ర పద్ధతి

image

పాక్షిక సాంద్ర పద్ధతిలో గొర్రెలను కొద్ది గంటల పాటు పచ్చిక బయళ్లలో మేపి మిగతా సమయం అంతా ఇంటివద్ద పాకలలో ఉంచి పెంచుతారు. అంతేకాక పాకలలో వాటికి పచ్చిగడ్డి, దాణా, త్రాగటానికి నీరు మొదలగునవి పెడతారు. ఈ పద్ధతిలో ఎంపిక చేసిన పొట్టేళ్లతోనే ఆడ గొర్రెలను జతకలపవచ్చు. బయట వృథాగా ఉన్న పచ్చిక బయళ్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.

News February 21, 2026

‘వైఖానస ఆగమం’ అనుసరించే శ్రీవారి పూజలు

image

విఖనస మహర్షి రచించిన ‘వైఖానస ఆగమం’ శ్రీవారి ఆలయ పూజా విధానాలకు మూలస్తంభం. ఇది దేవాలయ, గృహ పూజా శాస్త్రాన్ని సమగ్రంగా వివరిస్తుంది. ఈ ఆగమం ప్రకారం తిరుమలలో పూజలు జరుగుతాయి. వీటివల్ల లోకకళ్యాణం, సస్యశ్యామలం సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. TTD శతాబ్దాలుగా ఈ ఆగమ సూత్రాలను పాటిస్తూ శ్రీవారి కైంకర్యాలు నిర్వహిస్తోంది. భక్తులను ఆర్జిత సేవల్లో భాగస్వాములను చేస్తూ ఇందులోని నియమాలు కొనసాగిస్తున్నారు.

News February 21, 2026

వెయ్యేళ్ల నాటి సమాధిలో బంగారం, పెయింటింగ్స్

image

పనామాలోని ఎల్ కానో సైట్‌లో వెయ్యేళ్లకు పైబడిన పురాతన సమాధిని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సుమారు 800-1000AD మధ్య దీన్ని నిర్మించినట్లు లీడ్ రీసెర్చర్ వెల్లడించారు. అక్కడ మానవ అవశేషాలు, సిరామిక్ కళాఖండాలతోపాటు బంగారం కూడా ఉందని తెలిపారు. ‘మృతదేహానికి రెండు కంకణాలు, చెవి పోగులు, ఛాతీ ఆభరణాలు ఉన్నాయి. ఆ కాలంలో ఇతను సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తి అయి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.