News January 31, 2025

కేడీ, డీసీ, రౌడీ సస్పెక్టులకు సీపీ కౌన్సిలింగ్

image

సిద్దిపేట జిల్లాలోని కేడీ, డీసీ, రౌడీ సస్పెక్టులకు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలగాలని, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఎలాంటి నేరాలకు పాల్పడవద్దన్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News July 4, 2025

విశాఖ జిల్లాలో 636 పాఠశాల్లో వైద్య పరీక్షలు

image

DMHO జగదీశ్వరరావు ఆదేశాల మేరకు విశాఖలో పాఠశాల విద్యార్థులకు జూలై 3నుంచి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పలు పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్, ఎఎన్ఎమ్‌లు ఆరోగ్య పరీక్షలు చేశారు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే శారీరక ,మానసిక లోపాలను గుర్తించి సరైన వైద్యసేవలను ఇవ్వనున్నారు. జిల్లాలో 636 పాఠశాలల్లో 96,159 మంది, 914 అంగన్వాడీలలో 56,371 మందికి పరీక్షలు చేస్తారు.

News July 4, 2025

విశాఖ జిల్లా టీచర్లకు గమనిక

image

జాతీయ స్థాయి ఉత్తమ ఉపాద్యాయ అవార్డులు 2025‌కు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రభుత్వ/ ప్రైవేటు/ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. http://nationalawardstoteacher.education.gov.in వెబ్‌సైట్ ద్వారా జులై 13లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హత, వివరాలకు వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవాలని తెలిపారు.

News July 4, 2025

నిర్మల్: తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

image

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆర్థిక, సామాజిక కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారికి, లేదా ఉద్యోగం చేస్తూ చదువుకోవాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం. అడ్మిషన్లు జూన్ 12 నుంచి ఆగస్టు 12 వరకు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. SHARE IT