News June 13, 2024

కేబినేట్‌లో పిన్న వయస్కుడిగా శ్రీనివాస్

image

యువ నేతలతోపాటు సీనియర్లతో ఏపీ మంత్రి మండలి కొలువుదీరిన సంగతి తెలిసిందే. CMచంద్రబాబు తప్పితే మిగిలిన 23 మంది మంత్రుల్లో వయసు పరంగా చూస్తే.. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్(40) అతి పిన్న వయస్కుడిగా ఉన్నారు. అందరికంటే పెద్ద వయస్కుడిగా ఎన్ఎండీ ఫరూక్(74) ఉన్నారు. మన జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కొండపల్లికి ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉందో కామెంట్ చేయండి.

Similar News

News February 21, 2026

VZM: జనగణన-2027పై 27 నుంచి శిక్షణ

image

జనగణన మొదటి దశకు సంబంధించి జిల్లా, మండల స్థాయి అధికారులు, సాంకేతిక సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరం కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27 నుంచి మార్చి 1 వరకు MVGR కాలేజీలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు బ్లాక్ మ్యాపింగ్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News February 21, 2026

VZM: డ్రైవింగ్ శిక్షణలో లోపాలు బట్టబయలు

image

విజయనగరం జిల్లాలోని డ్రైవింగ్ స్కూళ్లపై రవాణాశాఖ శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. నిబంధనలు పాటించకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం, అర్హతలేని శిక్షకులతో శిక్షణ ఇవ్వడం వంటి లోపాలు గుర్తించారు. దీంతో 3 డ్రైవింగ్ స్కూళ్ల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. రోడ్డు భద్రత కోసం నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 21, 2026

మహిళలు, పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత: VZM SP

image

మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ దామోదర్ అధికారులకు ఆదేశించారు. మహిళల ఫిర్యాదులపై తక్షణ స్పందనతో పాటు వారి రక్షణకు అవసరమైన భద్రత చర్యలు వెంటనే చేపట్టాలని సిబ్బందికి శుక్రవారం సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు.