News February 17, 2025

కేయుూ: 21 నుంచి LLB మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

image

కేయూ పరిధిలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు(రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) ఈ నెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఆసిమ్‌ ఇక్బాల్‌ తెలిపారు. ఈ నెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మ.2 నుంచి సా. 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు.

Similar News

News December 16, 2025

పెద్దపల్లి జిల్లాలో పూర్తిస్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు

image

PDPL జిల్లా గ్రామ పంచాయతీ 3వ దశ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో మొత్తం 91 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలిగేడు, ఓదెల, PDPL, సుల్తానాబాద్ మండలాల్లో 128 పోలింగ్ అధికారులు, 166 అసిస్టెంట్ పోలింగ్ అధికారులను రిజర్వ్‌తో సహా నియమించారు. వీరికి DEC 12న శిక్షణ పూర్తయింది. 1,44,563 ఓట్లకు గాను 1,37,335 ఓటర్ల స్లిప్‌లు పంపిణీ కాగా, 7,228 స్లిప్‌లు ఇంకా మిగిలి ఉన్నాయి.

News December 16, 2025

నేడే ‘విజయ్ దివస్’.. ఎందుకు జరుపుకుంటారు?

image

DEC 16, 1971. ఇది పాకిస్థాన్‌పై యుద్ధంలో భారత్ సాధించిన విజయాన్ని గుర్తు చేస్తుంది. PAK సైన్యాధిపతి AAK నియాజీ 93వేల మంది సైనికులతో ఢాకాలో భారత్‌కు లొంగిపోతారు. పాక్ ఓడిపోయి తూర్పు పాకిస్థాన్ స్వతంత్ర ‘బంగ్లాదేశ్‌’గా ఏర్పడింది. ఈ విజయానికి గుర్తుగా ‘విజయ్ దివస్’ జరుపుకుంటున్నాం. 1971లో తూర్పు పాకిస్తాన్‌లో పాక్ ఆధిపత్యం, ఆంక్షలతో మొదలైన స్వతంత్ర పోరు క్రమంగా భారత్-పాక్ యుద్ధానికి దారితీసింది.

News December 16, 2025

జగిత్యాల: 3వ విడతలో మంత్రి, మాజీ మంత్రుల మధ్యనే పోటీ

image

జగిత్యాల జిల్లాలో 3విడత పంచాయతీ ఎన్నికలు ధర్మపురి నియోజకవర్గ పరిధిలోనే జరగనున్నాయి. అయితే ఇక్కడ ప్రస్తుత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇరువురికి చెందిన అభ్యర్థుల మధ్య గట్టిపోటీ నెలకొంది. తన సత్తాచాటేందుకు ఒకవైపు మంత్రి అడ్డూరి ప్రచారం చేయగా, మరోవైపు మాజీమంత్రి ఈశ్వర్ కూడ తన క్యాడర్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరిది పై చేయిగా ఉంటుందో బుధవారం తేలనుంది.