News October 26, 2025
కేయూలో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల ఫీజులు ఇవే..!

కేయూలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సామాజిక వర్గాల వారీగా హాస్టల్స్ డిపాజిట్లను నిర్ణయించారు. ఓసీ కేటగిరీ అభ్యర్థులు రూ.12,200, బీసీ కేటగిరి అభ్యర్థులు రూ.10,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.8,200 చెల్లించాల్సి ఉంది. అన్ని కేటగిరీలకు చెందిన దివ్యాంగులు ఎలాంటి ఫీజులు చెల్లించనవసరం లేదని డైరెక్టర్ తెలిపారు.
Similar News
News October 28, 2025
HYD మహిళాశక్తి క్యాంటీన్ల అవగాహనకు స్పెషల్ టీం

నగరంలో మహిళా శక్తి క్యాంటీన్లకు సంబంధించి ఆర్థిక స్వావలంబన, మహిళల స్వాతంత్ర్యానికి నిదర్శనంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్య దేవరాజన్ ప్రత్యేకంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటిని పరిశీలించినట్లు తెలిపారు. వీటిపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నారు.
News October 28, 2025
అందరూ ప్రజలకు అండగా ఉండాలి: చంద్రబాబు

మొంథా తుపాను నేపథ్యంలో కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం చంద్రబాబు మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు, రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
News October 28, 2025
ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల లాభమేంటి?

కలుపు నివారణలో మల్చింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్లాస్టిక్ షీటును మొక్క చుట్టూ నేలపై కప్పడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేల తేమను నిలుపుకుంటుంది. కలుపు కట్టడి జరుగుతుంది. పంట ఏపుగా పెరిగి దిగుబడి బాగుంటుంది. కూరగాయల సాగుకు ఇది అనుకూలం. మల్చింగ్ చేసిన ప్రాంతంలో పంటకాలం పూర్తయ్యాక దున్నాల్సిన అవసరం లేకుండా పాత మొక్కలను తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటుకోవచ్చు.


