News December 22, 2025

కేయూలో బీటెక్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన బీటెక్ 3వ, 5వ, 7వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. ఈనెల 22 నుంచి జరగాల్సిన పరీక్షలను పరిపాలనా కారణాలతో వాయిదా వేసి, డిసెంబర్ 29 నుంచి నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి టైం టేబుల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.

Similar News

News January 1, 2026

చిత్తూరు జిల్లాలో రూ.14 కోట్ల మందు తాగేశారు..!

image

చిత్తూరు జిల్లాలో డిసెంబరు 30న 7,500 బాక్సుల మద్యం, 2,500 బాక్సుల బీర్లు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా రూ.5.05 కోట్ల ఆదాయం వచ్చింది. 31వ తేదీన 4,900 మద్యం, 2400 బీరు బాక్సులు అమ్మడంతో రూ.3.78 కోట్లు సమకూరింది. బార్లలో రూ.2 కోట్లకు పైగా అమ్మకాలు జరగడంతో మొత్తంగా రెండు రోజులకు రూ.10.83 కోట్ల ఆదాయం చేకూరింది. జనవరి 1న రూ.2 కోట్లకు పైగా అమ్మకాలు జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

News January 1, 2026

KNR: ఉమ్మడి జిల్లాలో తగ్గిన చలి తీవ్రత

image

ఉమ్మడి జిల్లాలో గత వారం రోజులుగా వణికించిన చలి తీవ్రత గురువారం కాస్త తగ్గింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. జిల్లాల వారీగా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి: జగిత్యాల జిల్లా కొల్వాయి, రాఘవపేటలో 12.8 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 13.0, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో 13.7, కరీంనగర్ జిల్లా ఆసిఫ్‌నగర్‌లో 14.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.

News January 1, 2026

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే!

image

కామారెడ్డి జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. మేనూర్, రామలక్ష్మణపల్లి 12.1°C, గాంధారి 12.4, జుక్కల్ 13.1, డోంగ్లి 13.2, దోమకొండ 13.6, మాచాపూర్, పెద్దకొడప్గల్, నాగిరెడ్డిపేట్ 13.8, ఎల్పుగొండ 13.9, లచ్చపేట 14, బిచ్కుంద 14.1, రామారెడ్డి 14.3, పుల్కల్ 14.7, మాక్దూంపూర్ 14.8, పిట్లం, బీర్కూర్ 14.9°Cల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.