News January 3, 2026

కేయూ ఇయర్ వైస్ డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు శుభవార్త

image

కాకతీయ విశ్వవిద్యాలయం ఇయర్ వైస్ విద్యార్థులకు బ్యాక్ లాగ్ పరీక్షలకు అవకాశం కల్పిస్తూ విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి కట్ల రాజేందర్, అడిషనల్ కంట్రోలర్ వెంకయ్య నోటిఫికేషన్ జారీ చేశారు. బీఏ, బీఎస్సీ ,బీకాం, బీబీఎం, బీసీఏ( నాన్ ప్రొఫెషనల్) ఏడాది బ్యాక్ లాగ్ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 31 లోపు ఒక్కో పేపర్‌కు రూ.4 వేల చొప్పున కళాశాలల ద్వారా వర్సిటీ పరీక్షల విభాగంలో చెల్లించాలని తెలిపారు.

Similar News

News January 8, 2026

రెండేళ్లలోపే ₹3.02 లక్షల కోట్ల అప్పు: జగన్

image

AP: 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ₹3,90,247 కోట్ల అప్పు ఉందని వైసీపీ చీఫ్ జగన్ తెలిపారు. ‘మా హయాంలో ₹3,32,671 కోట్ల రుణాలు తీసుకుంటే ₹2,73,000 కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. చంద్రబాబు ఇప్పుడు రెండేళ్లలోపే ₹3,02,303 కోట్ల అప్పు చేశారు. కానీ అదంతా ఏం చేశారో తెలియదు. మేం సంక్షేమానికి క్యాలెండర్ రిలీజ్ చేస్తే బాబు అప్పులకు క్యాలెండర్ రిలీజ్ చేశారు’ అని ఎద్దేవా చేశారు.

News January 8, 2026

మహబూబాబాద్ ఆసుపత్రిలో సైకో వీరంగం

image

మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో గురువారం బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి కత్తులతో హల్‌చల్ చేశాడు. వైద్యం కోసం వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారిగా సైకోలా మారి ఆసుపత్రిలోని వస్తువులను ధ్వంసం చేస్తూ, కత్తితో పొడుస్తానంటూ రోగులను బెదిరించాడు. దీంతో రోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి గొంతు కోసుకోవడానికి ప్రయత్నించగా, సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పగలగొట్టి అతడిని బంధించారు.

News January 8, 2026

క్రమ పద్ధతిలో హిందువులపై దాడులు: షేక్ హసీనా

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. అక్కడ మైనారిటీలపై ఒక క్రమ పద్ధతిలో దాడులు జరుగుతున్నాయని NDTVతో చెప్పారు. ఈ హింసను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వమే అనుమతిస్తోందని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. శిక్ష పడుతుందనే భయం దోషుల్లో లేకుండా పోయిందన్నారు.