News September 20, 2024

కేయూ కాంట్రాక్టు లెక్చరర్‌పై మరో ఫిర్యాదు

image

కేయూ కాంట్రాక్టు లెక్చరర్ శ్రీధర్ కుమార్ లోథ్‌పై మరో మహిళ పార్ట్ టైమ్ లెక్చరర్ ఫిర్యాదు చేశారు. బదిలీ విషయంలో వేధిస్తూ అడ్డుకుంటున్నాడని తెలుగు డిపార్ట్‌మెంట్ లెక్చరర్ అన్నపూర్ణ అతడిపై గురువారం రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు ఇచ్చారు.కాగా ఈ నెల 16న తెలుగు డిపార్ట్‌మెంట్ HOD జ్యోతి తనను శ్రీధర్ కుమార్ లోథ్ మానసికంగా వేధిస్తున్నాడని రిజిస్ట్రార్‌‌కు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే అతడికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

Similar News

News September 20, 2024

మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేత

image

రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో సింథటిక్ శాలువాలు వాడకుండా చేనేత శాలువాలు, చేనేత బ్యాగులు వాడేలా ఆదేశాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. అనంతరం దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రి కొండా సురేఖతో నేతలు చర్చించారు.

News September 20, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> JN: మట్కా నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్టు
> WGL: దాడి చేసిన రౌడీ షీటర్ల అరెస్టు
> HNK: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
> MLG: రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు
> WGL: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి జైలు శిక్ష
> MLG: ఎంజీఎం ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన!
> MHBD: అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌కు దేహశుద్ధి!
> WGL: మహిళలకు పలు అంశాలపై అవగాహన సదస్సు

News September 19, 2024

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సర్వే చేయండి: కలెక్టర్

image

గ్రేటర్ వరంగల్ పరిధిలో నాలాలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 17న ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణల అంశాన్ని తీసుకువెళ్లారు.