News August 13, 2025
కేయూ దూరవిద్య ప్రవేశాల గడువు పెంపు..!

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూర విద్యా కేంద్రంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, ఓరియెంటేషన్ కోర్సుల్లో 2025-26కి ప్రవేశాల గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేశ్ లాల్ తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ, బీఎల్ఎఐఎస్ సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంఎల్ ఎస్సీ కోర్సుల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలన్నారు.
Similar News
News August 13, 2025
ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలకు కామారెడ్డి మహిళలు

ఈ నెల 15న ఢిల్లీలో జరగనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కామారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు మహిళా స్వయం సహాయక సంఘం ప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లక్ పతి దీదీ పథకం కింద రాష్ట్రం నుంచి ఐదుగురు మహిళలకు ఈ అవకాశం లభించగా, వారిలో ముగ్గురు కామారెడ్డి జిల్లా వారే కావడం విశేషం. ఈ మేరకు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వారిని అభినందించారు.
News August 13, 2025
VKB: ‘పంచాయతీ అధికారులు రానున్నారు’

గ్రామాలకు పంచాయతీ అధికారులు వస్తున్నందున క్లస్టర్ వారిగా వివరాలను రూపొందించాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారిగా క్లస్టర్లను రూపొందించాలని, గ్రామపంచాయతీ అధికారులు వస్తున్నందున వారి కేటాయింపులకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
News August 13, 2025
నల్గొండ: జాతీయ త్రోబాల్‌కు NG కళాశాల విద్యార్థి ఎంపిక

తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర త్రోబాల్ సెలెక్షన్‌లో నాగార్జున ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఎంపికయ్యాడు. ఈ విద్యార్థి త్వరలో జార్ఖండ్‌లోని రాంచీ పట్టణంలో జరిగే నేషనల్ త్రో బాల్ సెలక్షన్‌లో పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. ప్రవీణ్ కుమార్‌ను వైస్ ప్రిన్సిపల్ పరంగి రవికుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్లు అభినందించారు.