News June 24, 2024
కేయూ పరిధిలో నేటి నుంచి పరీక్షలు

కేయూ బీఫార్మసీ 8వ సెమిస్టర్ పరీక్షలు నేటి(సోమవారం) నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఫార్మసీ (సీబీసీఎస్) 8వ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 24, 26, 28, జులై 1వ తేదీల్లో నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు.
Similar News
News September 20, 2025
PM ఆవాస్ యోజన గ్రామీణ్ సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను శుక్రవారం ఆదేశించారు. ఇప్పటివరకు 571 గ్రామాలలో 69 శాతం సర్వే పూర్తయిందని, మిగిలిన 13,663 ఇండ్ల సర్వే త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సర్వే పూర్తితో కేంద్ర నిధులు అందుతాయని, మరిన్ని ఇండ్ల నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. సమావేశంలో ఎంపిడివోలు, అధికారులు పాల్గొన్నారు.
News September 19, 2025
సీతారామ ప్రాజెక్ట్ భూ సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్‌లో భూ సేకరణ, అటవీ సమస్యలు ఆలస్యానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న భూముల బదలాయింపు, అవార్డులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వల సర్వే 20 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు.
News September 19, 2025
ఖమ్మం: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన కలెక్టర్

రాపర్తి నగర్‌లోని TGMRJC బాలికల జూనియర్ కళాశాలలో నిట్, ఐఐటీ ఆశావహ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థినులు, తల్లిదండ్రులతో ఆత్మీయంగా మాట్లాడి తన అనుభవాలను పంచుకున్నారు. ఇంటర్‌లో కృషి చేస్తే మంచి కెరీర్ సాధ్యమని, పోటీ పరీక్షల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.