News December 24, 2025
కేయూ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో జనవరి 3 నుంచి జరగాల్సిన పీజీ 3వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ తెలిపారు. ఈ తేదీల్లో యూజీసీ నెట్, టీజీ సెట్, టీజీ టెట్ పరీక్షలు ఉన్నందున విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు చెప్పారు. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
Similar News
News December 26, 2025
పెద్దపల్లిలో కార్మిక – రైతు సంఘాల నిరసన

కేంద్రంలోని BJP ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ వ్యతిరేక విధానాలను వెంటనే విడనాడాలని డిమాండ్ చేస్తూ PDPLలో కార్మిక-రైతు సంఘాల ఆధ్వర్యంలో ITI గ్రౌండ్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్తు సవరణ బిల్లు, లేబర్ కోడ్స్, ఉపాధి హామీ చట్టంతో ప్రజలు నష్టపోతున్నారని నేతలు విమర్శించారు. విధానాలు మార్చకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
News December 26, 2025
గ్రేటర్ నయా రూపం ఇదే!

GHMC తాజా అధికారిక మ్యాప్ చూస్తుంటే సీన్ అర్థమవుతోంది. పాత వార్డుల లెక్కలకు చెల్లుచీటి రాస్తూ సరిహద్దుల పునర్విభజనతో సిటీ మ్యాప్ కొత్తగా మెరుస్తోంది. జనాభా పెరిగిన చోట వార్డులను ముక్కలు చేసి, పరిపాలన గల్లీ స్థాయికి చేరేలా స్కెచ్ వేశారు. శేరిలింగంపల్లి నుంచి ఉప్పల్, కుత్బుల్లాపూర్ నుంచి రాజేంద్రనగర్ వరకు పెరిగిన కాలనీలన్నీ ఇప్పుడు సరికొత్త సర్కిళ్లలోకి చేరాయి. మ్యాప్‌లో జోన్‌ల సరిహద్దులు మారాయి.