News December 24, 2025

కేయూ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో జనవరి 3 నుంచి జరగాల్సిన పీజీ 3వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ తెలిపారు. ఈ తేదీల్లో యూజీసీ నెట్‌, టీజీ సెట్‌, టీజీ టెట్‌ పరీక్షలు ఉన్నందున విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు చెప్పారు. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

Similar News

News December 24, 2025

ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్‌లో కీలక సమాచారం?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ కీలకంగా మారుతోంది. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జి వివరాలు సహా వందల ఫోన్ నంబర్లు ఉన్నట్లు సిట్ గుర్తించింది. వీటిని ప్రభాకర్ రావు ముందుంచి సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు బృందం ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి చాలా వరకు ఆధారాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఈ పెన్ డ్రైవ్‌ కీలకం అవుతోంది.

News December 24, 2025

ఐటీ విభాగంలో మెదక్ పోలీస్ సిబ్బంది ప్రతిభ

image

మెదక్ జిల్లా పోలీస్ సిబ్బంది CCTNS/ ఐటీ ఆధారిత వ్యవస్థల అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. రాష్ట్ర అదనపు డీజీపీ(టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాసరావు చేతుల మీదుగా కమెండేషన్ లెటర్స్, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. మెదక్ జిల్లా నుంచి ఐటీ కోర్ టీం సభ్యులు అనిల్, ఆర్.అమరనాథ్, టెక్ టీం రైటర్స్ మౌనిక, రాజు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. వీరిని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.

News December 24, 2025

చరిత్రలో తొలిసారి.. వన్డేల్లో 574 పరుగులు

image

విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజే సంచలనం నమోదైంది. వన్డే హిస్టరీలోనే తొలిసారి బిహార్ జట్టు 500 పరుగులు చేసింది. 45 ఓవర్లలోనే ఆ మైలురాయిని చేరుకుంది. మొత్తంగా 50 ఓవర్లలో 574/6 స్కోర్ చేసింది. వైభవ్ 190(84), ఆయుష్ 116(56), సకిబుల్ గని 128*(40B), పీయూష్ సింగ్ 77 ఆకాశమే హద్దుగా చెలరేగారు. గని 32 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించారు. లిస్టు A క్రికెట్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.