News October 24, 2025
కేయూ పరిధిలో హాస్టల్ వసతికి దరఖాస్తులు ఆహ్వానం

కేయూపీజీ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందిన ఫస్టియర్ విద్యార్థులు హాస్టల్ వసతి, మెస్ సదుపాయం కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని హాస్టళ్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్.పీ.రాజ్‌కుమార్ సూచించారు. విద్యార్థులు https://kucolleges.co.in/hostels/new_admissions వెబ్‌సైట్‌లో ఫీజు చెల్లించి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి రశీదు జత చేయాలన్నారు. అదనంగా ఆధార్, కుల ధ్రువపత్రం, ఫొటోలు సమర్పించాలన్నారు.
Similar News
News October 24, 2025
పెనుగొండ: గంజాయి కలిగి ఉన్న యువకులు అరెస్ట్

పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి బ్రిడ్జ్ వద్ద గంజాయితో ఉన్న ఐదుగురు యువకులను పెనుగొండ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 5.630 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పెనుగొండకు చెందిన సాయి నాగేంద్ర, దుర్గాసాయి, చందు, దానేశ్వరరావు, సిద్ధాంతానికి చెందిన సాయిరాంను అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై గంగాధర్ తెలిపారు.
News October 24, 2025
ఓయూ MBA పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
News October 24, 2025
శేష వాహనంపై కురుమూర్తి రాయుడు

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కురుమూర్తి స్వామివారు పద్మావతి సతీసమేతంగా శేషవాహనంపై ఊరేగింపులో దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాల మధ్య పల్లకీ సేవ నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి మోకాళ్ల గుండు వరకు స్వామివారు విహరించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమోగాయి. శేషవాహనం దాస్యభక్తికి నిదర్శనమని భక్తులు విశ్వసిస్తారు.


