News October 24, 2025

కేయూ పరిశోధకురాలు చైతన్య కుమారికి డాక్టరేట్

image

కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగ పరిశోధకురాలు కె.చైతన్య కుమారి డాక్టరేట్ పొందారు. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ ప్రకటించారు. ఆచార్య వల్లూరి రామచంద్రం మార్గదర్శకత్వంలో ఆమె “Public Policy and Tribal Welfare: A Study of ITDA Programs in Kumram Bheem Asifabad District” అంశంపై పరిశోధన పూర్తి చేశారు. మంచిర్యాల్ జిల్లాకు చెందిన ఆమెను అధ్యాపకులు అభినందించారు.

Similar News

News October 24, 2025

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: పరిగి ఎమ్మెల్యే

image

ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం 24 మంది లబ్ధిదారులకు రూ.24,02,784 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. అధికారులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

News October 24, 2025

పాలమూరు: మళ్లీ పాలెం భయానకం.. చిన్నటేకూరు దుర్ఘటన

image

కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం 2013 అక్టోబర్ 30న జరిగిన పాలెం దుర్ఘటనను తలపించింది. అప్పట్లో 45 మంది సజీవదహనం కాగా, ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయాలతో బయటపడ్డారు. మంటల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోవడం వంటి రెండు చోట్లా ఒకే తరహా భయానక దృశ్యం కనపడింది.

News October 24, 2025

తల్లి, కూతురు మృతితో పాపన్నపేట, శివ్వాయిపల్లిలో విషాదం

image

బస్సు దగ్ధం ఘటనలో తల్లి కూతుళ్లు సజీవ దహనం కాగా మెట్టినిల్లు మెదక్ మండలం శివ్వాయపల్లి, పుట్టినిల్లు పాపన్నపేటలో తీవ్ర విషాదం అలుముకుంది. విదేశాల్లో ఉంటున్న ఆనంద్ కుటుంబం అప్పుడప్పుడు కుటుంబీకులను పలకరించేందుకు వచ్చి వెళ్లే వారు. ఇలా ప్రమాదంలో మృతిచెందడంతో పలువురు కన్నీరుమున్నీరవుతున్నారు. సంధ్యారాణి పాపన్నపేట మాజీ సర్పంచ్ గురుమూర్తి సోదరి. రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.