News February 24, 2026

కేయూ పీజీ పరీక్షల సవరించిన టైమ్‌ టేబుల్ విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పీజీ మొదటి సంవత్సరం (ప్రథమ సెమిస్టర్) రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల సవరించిన టైమ్‌టేబుల్ విడుదలైంది. పరీక్షలు మార్చి 5 నుంచి మార్చి 18 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. విద్యార్థులు నిర్ణీత తేదీల్లో సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు. పరీక్షా ప్రాంగణంలో సెల్‌ఫోన్లు పూర్తిగా నిషేధించారు.

Similar News

News March 2, 2026

HYD: ఇవి తింటే.. గుండె పదిలం

image

ఆరోగ్యకర జీర్ణ ప్రక్రయకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం అవసనమని రామంతపూర్ డా.అంబికా తెలిపారు. ఫైబర్ రిచ్ ఫుడ్స్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. అరటి, యాపిల్, పియర్, అవకాడో, బ్లాక్ బీన్స్, శనగలు, మినుముల వంటి పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, విత్తనాలు రోజువారీ ఆహారంలో చేర్చితే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని పేర్కొన్నారు.

News March 2, 2026

VKBకు రాహుల్ గాంధీ .. మాజీ మావోలతో MEET..!

image

కాంగ్రెస్ MP రాహుల్ గాంధీ నేడు VKBకు రానున్నారు. అనంతగిరిలోని హరిత రిసార్ట్‌లో జరుగుతోన్న TG, AP DCC అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాహుల్ DCC అధ్యక్షులకు పార్టీ సంస్థాగత బలోపేతం, కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల లొంగిపోయిన మాజీ మావోలతో భేటీ అయ్యే అవకాశముంది. ఉ.9.30కు ఢిల్లీ నుంచి HYD చేరుకోనున్నారు.

News March 2, 2026

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజుల సెలవు

image

హోలీ పండుగ సందర్భంగా మార్చి 2న జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్, కార్యాలయానికి సెలవు ప్రకటించారు. అలాగే కమిషన్ దారులు, ఖరీదారులు, కార్మికుల అభ్యర్థన మేరకు మార్చి 4న కూడా మార్కెట్ యార్డ్‌కు సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. మార్చి 5 గురువారం నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. సెలవు రోజుల్లో రైతులు సరుకులు తీసుకురాకూడదని సూచించారు.