News February 20, 2025
కేయూ: పీజీ మొదటి సెమిస్టర్ పరీక్ష వాయిదా

కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రానికి సంబంధించిన <<15507872>>పీజీ మొదటి సెమిస్టర్ పరీక్ష<<>> వాయిదా పడింది. ఈ నెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఉండటంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షను మార్చి 5వ తేదీన నిర్వహిస్తామని, మిగతా పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి, ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
Similar News
News November 13, 2025
నాగర్‌కర్నూల్: మటన్ ముక్క ఇరుక్కుని వృద్ధుడి మృతి

నాగర్‌కర్నూల్ జిల్లాలోని బొందలపల్లి విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బుధవారం రాత్రి తాపీ మేస్త్రిలకు ఏర్పాటు చేసిన దావత్‌లో లక్ష్మయ్య(65) వెళ్లాడు. అక్కడ మటన్ తింటుండగా అకస్మాత్తుగా ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందికి గురైన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.
News November 13, 2025
మంచిర్యాల: శ్రీరాంపూర్, మందమర్రికు పురస్కారం

బొగ్గు నాణ్యత వారోత్సవాల్లో భాగంగా శ్రీరాంపూర్,మందమర్రి ఏరియాలు అత్యంత ప్రతిభ కనబరిచింది. సింగరేణి వ్యాప్తంగా నిర్వహించిన వారోత్సవాల్లో శ్రీరాంపూర్ ఏరియా75:17%తో 2వ స్థానం,మందమర్రి ఏరియా 71:33శాతంతో 3వ స్థానంలో నిలిచింది.ఈనెల 19న హైదరాబాద్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఏరియా నుంచి పురస్కారం అందుకోనున్నట్లు అధికారులు చెప్పారు.2వ,3వ స్థానంలో నిలవడంతో అధికారులు,కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News November 13, 2025
మంచిర్యాల: ‘సర్వేయర్ల సమస్యలను పరిష్కరించండి’

తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా సర్వేయర్లు కలెక్టర్ కుమార్ దీపక్‌కి ఈరోజు వినతి పత్రం ఇచ్చారు. టీఎన్జీవో ప్రెసిడెంట్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా టీఎన్జీవో ఎస్ఎల్ఆర్ ప్రెసిడెంట్ సి.ఆశిశ్ కుమార్, సెక్రటరీ సైదులు, జిల్లా సర్వేయర్స్ కలెక్టర్‌ను కలిశారు. జిల్లాలో పనిచేస్తున్న సర్వేయర్ల సమస్యలపై చర్చించి సర్వేకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.


