News July 26, 2024

కేయూ పీజీ 2వ సెమిస్టర్ టైం టేబుల్‌ విడుదల

image

కేయూ పీజీ (MA/M.Com/M.Sc) రెండవ సెమిస్టర్ పరీక్షా టైం టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ బీఎస్‌ఎల్. సౌజన్య విడుదల చేశారు. ఆగస్టు 7న మొదటి పేపర్, 9న రెండవ పేపర్, 12న మూడవ పేపర్, 14న నాల్గవ పేపర్, 16న ఐదవ పేపర్, 19న ఆరవ పేపర్ పరీక్ష ఉన్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2.00 – 5 గంటల వరకు జరుగుతాయన్నారు.

Similar News

News February 15, 2026

వరంగల్: అభివృద్ధి కమిటీ సమావేశాలేవి?

image

వరంగల్‌లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్) సమావేశాలు సుమారు పదేళ్లుగా నిర్వహించడం లేదు. కమిటీ ఛైర్మన్‌గా కలెక్టర్, ప్రజాప్రతినిధులు సభ్యులుగా వ్యవహరిస్తారు. సీకేఎం జీఎంహెచ్, ఎంజీఎం వంటి సర్కారు ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత, సౌకర్యాల లేమితో రోగులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. గతంలో అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించే సమస్యలను వెంటనే పరిష్కరించేవారు.

News February 15, 2026

WGL: కార్యకర్తలు ఎవరు? కట్టప్పలు ఎవరు?

image

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో అధికార-ప్రతిపక్ష అభ్యర్థుల ఓటమిపై రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కాయి. కొన్ని వార్డుల్లో అనూహ్య ఫలితాలు రావడంతో అంతర్గత విభేదాలు, అసంతృప్తి నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకి పని చేయాల్సిన వారే ప్రత్యర్థులకు సహకరించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటమికి బాధ్యులెవరు అన్న దానిపై నేతలు సమీక్షలు చేపడుతున్నారు.

News February 13, 2026

నర్సంపేటలో బీజేపీ బోణీ

image

నర్సంపేట మున్సిపాలిటీ పరిధి 28వ వార్డులో బీజేపీ అభ్యర్థి జూలూరి రోజా రాణి విజయం సాధించారు. ఈ ఫలితంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మొదటి సారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన జూలూరి రోజా రాణి తొలి ప్రయత్నంలోనే గెలుపొందారు.