News December 20, 2025
కేయూ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలు విడుదల

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 22 నుంచి ప్రారంభం కావాల్సిన బీటెక్ 3, 5, 7వ సెమిస్టర్ పరీక్షలను డిసెంబరు 29 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎమీ ఆసీం ఇక్బాల్‌తో కలిసి శుక్రవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పూర్తి రీషెడ్యూల్ టైం టేబుల్‌ను త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News December 22, 2025
యూరియా బుకింగ్ ఇక యాప్‌తో మాత్రమే

TG: యూరియా పొందాలంటే రైతులు నేటి నుంచి Fertilizer Booking Appతో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఈనెల 20 నుంచి కొన్ని జిల్లాల్లో ఈ విధానం అందుబాటులోకి రాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఇదే విధానం అమలుకానుంది. పారదర్శకంగా, నిజమైన లబ్ధిదారులకే యూరియా పంపిణీకి ఈ విధానం తెచ్చామని ప్రభుత్వం తెలిపింది. యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకోవాలి?, ఏ పంటకు ఎన్ని బస్తాలు ఇస్తారో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 22, 2025
YS జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం

అనంతపురం జిల్లాలో మాజీ సీఎం YS జగన్ బర్త్ డే సంబరాలు చర్చనీయాంశంగా మారాయి. విడపనకల్లులో వైసీపీ నేతలు వేట కొడవళ్లతో పొట్టేళ్లను నరికి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేశారు. కనగానపల్లి మండలం భానుకోటలో సైతనం ఇదే తరహా సంబరాలు చేసుకున్నారు. ఫ్యాక్షన్ గ్రామమైన భానుకోటలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2029లో రప్పా రప్పా అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పొట్టేళ్లను బలితీయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
News December 22, 2025
ఆసుపత్రి వార్డుల్లో ఆహారం తినడంపై నిషేధం

TG: ఎలుకలు, కీటకాల సమస్య నివారణకు ఆసుపత్రి వార్డుల్లో రోగుల సహాయకులు భోజనం చేయడంపై వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిషేధం విధించింది. క్యాంటీన్లలోనే ఆహారం తినేందుకు అనుమతి ఇచ్చింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరింది. వార్డులో ఆహారం తిని పారవేయడంతో ఎలుకల బెడద పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.


