News September 20, 2025
కేయూ: 15 వరకు డిగ్రీ సెమిస్టర్ ఫీజుల చెల్లింపు

కేయూ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీతో పాటు ఇతర కోర్సుల 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల ఫీజులను అక్టోబరు 15 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించుకోవాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారులు తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో అక్టోబరు 22 వరకు ఫీజులు చెల్లించుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు కేయూ వెబ్సైట్‌లో చూడాలని సూచించారు.
Similar News
News September 20, 2025
బోయినపల్లిలో రియల్ ఎస్టేట్ మోసం.. భార్యాభర్తల అరెస్ట్

రియల్ ఎస్టేట్ మోసానికి పాల్పడిన దంపతులను బోయిన్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగి ప్రాంతానికి చెందిన పరశురాములు, ఆయన భార్య మాధవి ‘స్కంద శ్రీ ఇన్ఫ్రా డెవలపర్స్’ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి రమ్య, వీణ అనే మహిళల నుంచి రూ.22.50 లక్షలు వసూలు చేశారు. డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరించడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
News September 20, 2025
కాజీపేట రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని మృతదేహం

దిల్లీ నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే రైల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడని 108 సిబ్బందికి రైల్లో ప్రయాణికులు సమాచారం ఇచ్చారు. దీంతో హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్లో 108 సిబ్బంది ఈఎంటీ చైతన్య, రైల్వే డాక్టర్లు పరిశీలించారు. అప్పటికే ఆ ప్రయాణికుడు మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంలోని మార్చురీకి తరలించారు. దీనిపై రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.
News September 20, 2025
NZB కమీషనరేట్ పరిధిలో పలువురు SIల బదిలీ

NZB పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు SIలను బదిలీ చేస్తూ CP సాయి చైతన్య శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆర్మూర్‌లో ఉన్న గోవింద్, 4వ టౌన్‌లోని మహేష్, VRలో ఉన్న మహేష్‌ను CCS NZBకు బదిలీ చేశారు. అలాగే VR లోఉన్న వినయ్ కుమార్‌ను ఆర్మూర్‌కు, సాయాగౌడ్‌ను CSB NZB, BBS రాజును కలెక్టరేట్, సామ శ్రీనివాస్‌ను సౌత్ రూరల్ నుంచి NZB రూరల్ ఎస్సై-2గా, మొగులయ్యను ఒకటో టౌన్ నుంచి మాక్లూర్ఎస్సై-2గా బదిలీ చేశారు.