News February 5, 2025
కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News October 26, 2025
నిడిగొండ త్రికూట ఆలయాన్ని సందర్శించిన హెరిటేజ్ బృందం

రఘునాథపల్లి మండలం నిడిగొండలోని త్రికూట ఆలయాన్ని ‘హైదరాబాద్ హెరిటేజ్ వాక్’ మిత్ర బృందం సభ్యులు ఆదివారం సందర్శించారు. స్థానిక శివాలయం, ఇతర చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను ఆలయ పూజారి కృష్ణమాచార్యులు వారికి వివరించారు. అంతకుముందు జనగామ మండలం పెంబర్తిలోని హస్త కళలను సందర్శించి, అక్కడ వర్క్‌షాపు నిర్వహించారు.
News October 26, 2025
సిరిసిల్ల: రేపటి ప్రజావాణి రద్దు

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రేపు (అక్టోబర్ 27) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించిన లక్కీ డ్రా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News October 26, 2025
కృష్ణ: గుట్టు చప్పుడు కాకుండా మాయం

కృష్ణ మండలం గుడెబల్లూర్ తిమ్మప్ప స్వామికి దీపం వెలిగించే గుట్టలో కొన్ని రోజులుగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బ్లాస్టింగ్ చేసి అక్రమంగా రాయిని తరలిస్తున్నారు. సహజ సంపద ఇలా అక్రమంగా తరలిస్తుంటే అధికారులకు తెలియకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుట్టను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.


