News February 5, 2025

కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News March 1, 2026

ఆసుత్రికి చేరుకున్న నెల్లూరు ఎస్పీ

image

నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ ప్రసూతి విభాగంలో ఆదివారం రాత్రి ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం ఏర్పడటంతో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల వెంటనే స్పందించారు. ఆమె నెల్లూరు ప్రసూతి విభాగానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.

News March 1, 2026

ఈ నెల 3న మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం మూసివేత

image

చంద్రగ్రహణం నేపథ్యంలో మల్దకల్ గ్రామంలోని ప్రసిద్ధ ఆదిశిలాక్షేత్రం శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ఛైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు స్వామివారి దర్శనాలు నిలిపివేయనున్నారు. మంగళ ఉ. 7 గంటలలోపు స్వామికి నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు చేసి ఆలయ ద్వారాలు మూసివేస్తారు.

News March 1, 2026

చౌడేపల్లి: చిరుత దాడిలో దూడ మృతి

image

చౌడేపల్లి మండలం ముదిరెడ్డిపల్లికి చెందిన రైతు గిరి తన పశువుల మేత కోసం గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో తోలుకెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం పెద్ద వక్కిరి వద్ద పశువులు మేత మేస్తుండగా చిరుత దాడి చేసినట్లు రైతు తెలిపాడు. ఈ దాడిలో దూడ మృతి చెందినట్లు వాపోయాడు. చిరుత పులి దాడి నుంచి పశువులను కాపాడాలని రైతులు కోరుతున్నారు.