News February 24, 2026
కేరళను ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం ఆమోదం

కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2024 జూన్‌లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పేరును కేరళంగా మారుస్తూ తీర్మానం చేసింది. కేంద్రం సైతం ఇదే పేరును గుర్తించాలని ప్రతిపాదించింది. ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగంలోని ఫస్ట్ షెడ్యూల్‌లోనూ కేరళను కేరళంగా మార్చేలా సవరణలు చేపట్టాలని కోరింది. తాజాగా దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది.
Similar News
News February 27, 2026
అఫ్గాన్‌పై విరుచుకుపడుతున్న పాక్!

పాక్, అఫ్గాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. <<19249664>>అఫ్గాన్ దాడుల<<>>కు ప్రతీకారంగా పాక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఆపరేషన్ గజబ్-లిల్-హక్ పేరిట ఏకంగా రాజధాని కాబూల్‌పైనే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాందహార్, పక్తియాలోని మిలిటరీ బేస్‌లపైనా పాక్ సేన విరుచుకుపడినట్లు తెలుస్తోంది. అనేక ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు సమాచారం. తాలిబన్ల నెట్‌వర్క్ భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
News February 27, 2026
బౌలర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి: సూర్య

బ్యాటర్లు అద్భుతంగా రాణించారని, బౌలింగ్ విభాగంలో ఇంకాస్త ‘క్లినికల్’గా ఉండాల్సిందని జింబాబ్వేపై విజయం తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ అభిప్రాయపడ్డారు. జింబాబ్వే బ్యాటర్ బెన్నెట్ అద్భుతంగా ఆడారని, సండే WI తో మన బౌలర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కోల్‌కతాలో విండీస్‌తో జరిగే సెమీఫైనల్ బెర్త్ పోరుకు తమ వ్యూహాలను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
News February 27, 2026
ఆంథ్రోపిక్‌కు పెంటగాన్ అల్టిమేటం!

అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ప్రముఖ AI సంస్థ ‘ఆంథ్రోపిక్’కు డెడ్ లైన్ విధించింది. తమ Claude మోడల్‌ను మిలిటరీ అవసరాలకు, నిఘా పనులకు వాడుకోవడానికి అనుమతించాలని, లేదంటే ఫిబ్రవరి 27 సాయంత్రం కల్లా ₹1,600 కోట్ల కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించింది. కంపెనీని ‘సప్లై చైన్ రిస్క్’గా ప్రకటించి బ్లాక్ లిస్ట్‌లో పెడతామని అల్టిమేటం ఇచ్చింది. AIని యుద్ధానికి ఉపయోగించాలని ట్రంప్ సర్కార్ యోచిస్తోంది.


