News October 12, 2025
కేవీపల్లి : ఈతకు వెళ్లి స్టూడెంట్ మృతి

ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. మహానంది వ్యవసాయ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్న కేవీపల్లి విద్యార్థి జనార్దన్ నాయక్ సమీపంలోని పాలేరు వాగులో దిగి మృతిచెందినట్లు ప్రిన్సిపల్ జయలక్ష్మి తెలిపారు. జిల్లెల్లమంద సమీపంలోని పెద్ద తండాకు చెందిన విద్యార్థి శనివారం కళాశాలకు సెలవు కావడంతో పాలేరు వాగులో ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి వెళ్లినట్లు ఆమె పేర్కొన్నారు.
Similar News
News October 12, 2025
NLG: విదేశీ పర్యటనకు ఉపాధ్యాయులు

విదేశాల్లో విద్యా విధానం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఉపాధ్యాయులను ఐదు రోజుల పాటు సింగపూర్, జపాన్, వియత్నాం, ఫిన్ లాండ్ పర్యటనకు పంపించనుంది. జిల్లాకు ముగ్గురు, నాలుగు బృందాల్లో 40 మంది చొప్పున 160 మందిని ఎంపిక చేయనున్నారు. కలెక్టర్ ఛైర్మన్‌గా ఏడు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని కమిటీ వీరి ఎంపిక జరపనుంది.
News October 12, 2025
HSCC లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్(HSCC)లిమిటెడ్‌లో 27 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఎంబీఏ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఫార్మసీ డిగ్రీ, పీజీ డిప్లొమా, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: http://hsccltd.co.in/
News October 12, 2025
దీపావళి ఆఫర్లు ప్రకటించిన టాటా, హ్యుందాయ్

దీపావళి సందర్భంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. అక్టోబర్ 21 వరకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛైంజ్ ఆఫర్లు, లాయల్టీ బోనస్‌లు ఉంటాయని టాటా మోటార్స్ తెలిపింది. టియాగోపై రూ.20-30వేలు, నెక్సాన్‌పై రూ.35వేలు, పంచ్‌పై రూ.25వేలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది. అటు హ్యుందాయ్ కంపెనీ సైతం వివిధ కార్లపై ఆఫర్లు ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపు, తాజా డిస్కౌంట్లతో కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.