News July 27, 2024
కేవీ పల్లి: కర్రతో అల్లుడు దాడి.. అత్త మృతి

అత్తను అల్లుడు దారుణంగా కొట్టి చంపిన ఘటన కేవీ పల్లి మండలంలో చోటుచేసుకుంది. కేవీ పల్లి(M) వగళ్ల గ్రామం నార్మకలపల్లికి చెందిన సురేశ్ భార్య నీలవతి(46)ను అల్లుడు విజయ్ కుమార్ దారుణంగా కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కేవీ పల్లి పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కలకడ CI శ్రీనివాసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Similar News
News December 30, 2025
కొత్తగా చిత్తూరు జిల్లా ఇలా..!

☞ డివిజన్లు: 4 (చిత్తూరు, కుప్పం, పలమనేరు, నగరి)
☞ మండలాలు: 28
☞ జనాభా: 16,43,224
☞ నియోజకవర్గాలు: 6
☞ పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యాన్ని చిత్తూరులోకి మార్చారు. పుంగనూరు, చౌడేపల్లె మదనపల్లె డివిజన్‌లోకి, సోమల, సదుం మండలాలు పీలేరు డివిజన్‌లోకి వెళ్లిపోయాయి. పులిచెర్ల, రొంపిచర్ల చిత్తూరు డివిజన్‌లోనే కొనసాగనున్నాయి. 4మండలాలు అన్నమయ్యలోకి వెళ్లడంతో జిల్లా జనాభా 2,29,727 లక్షలు తగ్గింది.
News December 29, 2025
చిత్తూరు SPని కలిసిన ట్రైనీ SP

చిత్తూరు SP తుషార్ డూడీని సోమవారం ట్రైనీ ఎస్పీ డా.తరుణ్ పహ్వ మర్యాదపూర్వకంగా కలిశారు. 2024 బ్యాచ్‌కు చెందిన ఆయన AP క్యాడర్‌కు ఎంపికయ్యారు. ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత 6 నెలల ప్రొబేషనరీ ట్రైనింగ్ నిమిత్తం చిత్తూరుకు చేరుకున్నారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం, సమస్యలను శ్రద్ధగా వినడం, వేగంగా పరిష్కరించడం ముఖ్యమని SP ఆయనకు సూచించారు.
News December 29, 2025
తిరుమల: 365 రోజులు.. 450 ఉత్సవాలు

ఏడాదికి 365 రోజులే. కానీ కోరిన కోర్కెలు తీర్చే తిరుమల కోనేటి రాయుడికి ఏడాదిలో 450పైగా ఉత్సవాలు జరుగుతాయి. సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చన, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, పూలంగి, శుక్రవారాభిషేకం, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం నక్షత్రోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, పద్మావతి పరిణయం తదితర ఉత్సవాలు చేస్తారు. ఇలా రోజూ ఒక పండగగా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా తిరుమల విరాజిల్లుతోంది.


